తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో థియేటర్లు ఉండగా హైదరాబాద్‌లోని సంధ్య 70MM థియేటర్ కు ఉన్న క్రేజ్ రేంజ్ వేరు .. ఇప్పుడంటే అల్లు అర్జున్ పుణ్యమా అని ఈ థియేటర్ కు బాడ్ నేమ్ వచ్చింది కానీ .. ఒకప్పుడు ఈ థియేటర్లో సినిమా రిలీజ్ కావాలని స్టార్ హీరోలు ఎందరో పోటీపడేవారు .. సంధ్య థియేటర్ చరిత్ర ఈనాటిది కాదు .. దశాబ్దాలకు తెలుగు సినిమాని గుండెల్లో పెట్టుకుని మోస్తుంది సంధ్య థియేటర్ .. ఎందరో అగ్ర హీరోల సినిమాలకు సంధ్య థియేటర్ ఒక సెంటిమెంట్ .. వేల థియేటర్లు , వేల స్క్రీన్లు ఉన్నా సరే సంధ్య థియేటర్లో బొమ్మప‌డితేనే ఏ స్టార్ హీరో అయినా సరే సాటిస్ఫై అవుతారు. అది సూపర్ స్టార్ అయిన , రెబల్ స్టార్ అయిన , యంగ్ టైగర్ అయినా , మెగాస్టార్ అయిన.. ఒక సినిమా బ్లాక్ బస్టర్ లేదంటే అట్టర్ ప్లాప్ అనే టాక్ ఫస్ట్ వినిపించేది సంధ్య థియేటర్ దగ్గరే .. ఈ బెనిఫిట్ షో అయినా ప్రీమియర్ షో అయినా ఫస్ట్ పడేది సంధ్య థియేటర్లోనే ..


 ఆ స్థాయిలో తెలుగు సినిమాకు సంధ్య థియేటర్ ఒక పాపులర్ సెంటిమెంట్ థియేటర్ గా మారిపోయింది .. అసలు సంధ్య థియేటర్ చరిత్ర ఎప్పటిది ? ఈ థియేటర్ ను ఎప్పుడు నిర్మించారు? ఈ థియేటర్లో మొదట రిలీజ్ అయిన సినిమా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 1979లో 70 MM థియేటర్ల ప్రస్థానం అప్పుడే మొదలైంది .. అదే సమయంలో హైదరాబాదులో ఎంతో పాపులర్ సెంటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్ను నిర్మించారు .. జనవరి 18 1979లో ఈ థియేటర్ను మొదలుపెట్టారు .. ఈ థియేటర్లో ముందుగా హిందీ సినిమా షాలిమార్ రిలీజ్ అయింది .. తర్వాత భారతీయ సినిమా చరిత్రను తిరగరాసిన షోలే సినిమా కూడా ఇక్కడే రిలీజ్ అయింది .. అక్కడి నుంచి ఈ థియేటర్ ప్రస్థానం ఊహించని రేంజ్ లో సాగింది .. చాలామంది స్టార్ హీరోలు సంధ్య థియేటర్లో తమ సినిమా కచ్చితంగా రిలీజ్ అవ్వాలని పట్టుబడుతూ వచ్చారు. మాస్‌, క్లాస్ అని తేడా లేకుండా ఎక్కువగా ప్రేక్షకులు ఈ థియేటర్‌కు పోటీ పడే పరిస్థితి ఉంటుంది .. పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా ఏకంగా 227 రోజులు ఈ థియేటర్లో ఆడింది.


అలాగే ఈ థియేటర్లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా నిలిచింది .. గతంలో 1500 మంది కెపాసిటీ ఉండే  ధియేటర్  ఆ తర్వాత రీ మోడలింగ్ చేసి 1323 కి సిట్టింగ్ కెపాసిటీ తగ్గించారు. అలాగే సంధ్య థియేటర్లో 70 ఎం ఎం తో పాటు 35 ఎంఎం ధియేటర్ కూడా ఉంది .. 1981లో సంధ్య 35 ఎంఎం థియేటర్ మొదలుపెట్టారు . ఈ సంధ్య థియేటర్లో థర్డ్ క్లాస్ , ఫస్ట్ క్లాస్ , లోయర్ బాల్కనీ , అప్పర్ బాల్కనీ, బాక్స్ బి సిట్టింగ్ ఆప్షన్ కూడా ఉన్నాయి . థర్డ్ క్లాస్ టికెట్ 70 రూపాయలు ఉంటుంది .. బాక్స్ సీట్ల కోసం 200 రూపాయల ఖర్చు పెట్టాల్సి ఉంటుంది .. హై అండ్ డాల్బీ డిజిటల్ అరౌండ్ ఎక్స సౌండ్ సిస్టం సంధ్య థియేటర్ లో ఉంటుంది. ఇంత చరిత్ర ఉన్న సంధ్యా థియేటర్ ఇప్పుడు కనుమరుగైపోయే అవకాశం కనబడుతోంది. హైదరాబాద్ పోలీసులు ఈ థియేటర్ విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం మరో చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో లైసెన్స్ రద్దు చేస్తామని నోటీసులు జారీ చేశారు తెలంగాణ పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: