ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తూ యాంకర్ సుమ తన సహజమైన రీతిలో దర్శకుడు సుకుమార్ ను కార్నర్ చేయడానికి తన వంతు ప్రయత్నం చేసింది. ‘జీవితంలో ఏదైనా వదిలేయాల్సి వస్తే మీరు దేన్ని త్యాగం చేస్తారు’ అని అడిగిన సుమ ప్రశ్నకు దర్శకుడు సుకుమార్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘సినిమా’ అని అనడంతో ఆకార్యక్రమానికి వచ్చిన చాలా మందితో పాటు సుకుమార్ పక్కనే ఉన్న రామ్ చరణ్ షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
సుకుమార్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందబోతున్న ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉండటంతో ‘పుష్ప 2’ మూవీకి విపరీతమైన క్రేజ్ తో ఈమూవీ కథ గురించి పట్టించుకోకుండా సుకుమార్ టేకింగ్ మేకింగ్ లకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. కెరియర్ ఇంత తారా స్థాయిలో కొనసాగుతున్న నేపధ్యంలో సుకుమార్ మనసులో నిజంగానే సినిమాలను వదిలేయాలని అనుకుంటున్నాడా అంటూ మరికొందరు ఆశ్చర్య పోతున్నారు.
అయితే సుకుమార్ ఈమాట అన్న వెంటనే పక్కనే ఉన్న రామ్ చరణ్ సుకుమార్ చేతిలోని మైక్ ను లాగేసుకుని తాను ఒప్పుకోను అంటూ కామెంట్ చేయడంతో పెదవుల పై చిరునవ్వులు విరిసాయి. వాస్తవానికి ప్రస్తుత కాలంలో సినిమా తీసి మెప్పించడం చాల కష్ట సాధ్యమైన వ్యవహారంగా మారిపోవడంతో ఆ టెన్షన్ తట్టుకోలేక సుకుమార్ మనసులో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి అనుకోవాలి. అయితే ప్రస్తుతం సుకుమార్ పారితోషికం 100 కోట్ల స్థాయిలో ఉంది అన్న వార్తలు వస్తున్న సుకుమార్ అలాంటి సాహసం చేయడు అనుకోవాలి..