పాన్ ఇండియా సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడు.. అదే సినిమాను బాలీవుడ్ లో కూడా కబీర్ సింగ్ గా తెరకెక్కించి, మంచి విజయం అందుకున్నారు .. ఆ తర్వాత య‌నిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మారు మోగిపోయాడు .. ఈ సినిమాతో సౌత్ ప్రేక్షకుల్ని కాదు నార్త్‌ ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇక దాంతో సందీప్ రెడ్డి వంగ పేరు భారీగా క్రేజ్ వ‌చ్చింది .. నేడు అయిన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆస్తుల ఎంతనే విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


సందీప్ రెడ్డి వంగ సైకోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ ని పూర్తి చేశాడు .. అలాగే అర్జున్ రెడ్డి సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఆయన తర్వాత య‌నిమల్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న .. కానీ ఆయన సినిమాలో ఆడవాళ్లను కించపరిచేలా చూపించార‌ని ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు .. అయితే సందీప్ రెడ్డి చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఎన్నో కష్టాలు అనుభవించాడు .. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని విషయం తెలిసిందే. అందుకే తాను కూడా ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చాడు. అలాగే తన బయోడేటాను పట్టుకుని చిత్ర పరిశ్రమలో చెప్పులు అరిగేలా తిరిగాడట .. అసిస్టెంట్ డైరెక్టర్గా మారడానికి ఎంతో శ్రమ పడ్డాడట.. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా మారడం కోసం పెద్ద పెద్ద డైరెక్టర్ల ఇంటికి అలాగే నిర్మాతలు ఇంటి చుట్టూ తిరిగేవాడట .. అయితే ఈయన చూసిన చాలామంది గేటు దగ్గరే తన రెస్యూమ్ పెట్టి వెళ్ళు అంటూ అవమానించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు.


అలాంటి అవమానాలు ఆయన కెరీర్ లో ఎన్నో చూసి పట్టుదలతో డైరెక్టర్ అవ్వాలనుకున్న సందీప్ రెడ్డి వంగ .. ఇప్పటివరకు ఎవరు ఊహించని అద్భుతమైన కథను రెడీ చేసుకున్నాడు .. నిర్మాతలను కూడా సిద్ధమయ్యారు అలా సినిమా తీసే సమయానికి ఆ నిర్మాతలు వెనక్కి తగ్గడంతో .. తన తల్లిదండ్రులు ఇచ్చిన 36 ఎకరాల భూమిని కూడా అమ్మే తొలి సినిమా అర్జున్ రెడ్డి సినిమాను తన సొంత బ్యానర్ లోనే నిర్మించారు . అంత నమ్మకంతోనే తన సొంత భూమిని కూడా అమ్మే సినిమా తీసి భారీ విజయం అందుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో తాను తిరిగి తన 36 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశాడు. ఇక తర్వాత బాలీవుడ్లో కబీర్ సింగ్ , య‌నిమల్ సినిమాలతో 1267 కోట్ల బిజినెస్ చేశారు .. ఇక అందులో సందీప్ రెడ్డి వంగ నిర్మాతగా దాదాపు 450 కోట్లకు పైగా సంపాదించినట్లు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు .. వీటితో పాటు ఈయనకు పూర్వికులు ఆస్తులు కూడా భారీగానే వచ్చినట్టు తెలుస్తుంది.. సుమారుగా 550 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినట్టు తెలుస్తుంది .. ఇలా ఏదేమైనా కూడా ఒకప్పుడు తన సినిమా కోసం ఆస్తి అమ్ముకున్న సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా సంచలనాలు క్రియేట్ చేస్తూ వందల కోట్ల ఆస్తికి అధిపతి అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: