రామ్ చరణ్ , బాలకృష్ణ నటించిన సినిమాలు ప్లాఫ్ అవ్వగా .. వెంకటేష్ ఎఫ్2 సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది .. వీటి కన్నా ముందు రెండు సార్లు బాలకృష్ణ - వెంకటేష్ సంక్రాంతికి పోటీపడ్డారు. 2000 సంవత్సరం సంక్రాంతికి బాలయ్య వంశోద్ధారకుడు, వెంకటేష్ కలిసుందాం రా సినిమాలు విడుదలయ్యాయి .. ఇక వంశోద్ధారకుడు సినిమా ఆ సంక్రాంతికి పెద్దగా మెప్పించలేకపోయింది .. ఇక కలిసుందాం రా సినిమా మాత్రం వెంకటేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది .. అదే సమయంలో రిలీజ్ అయిన చిరంజీవి అన్నయ్య సినిమా కూడా విజయం సాధించింది. అలాగే 2001 సంక్రాంతి బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. అలాగే వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాతో సంక్రాంతి పోటీలో నిలిచాడు. అయితే 2001 సంక్రాంతికి బాలయ్య నటించిన నరసింహనాయుడు సినిమా ఆయన కెరియర్ లోనే తిరిగిలోని విజయంగా నిలిచింది..
అయితే దేవిపుత్రుడు మాత్రం బోల్తా కొట్టింది .. ఇలా మొత్తంగా మూడుసార్లు సంక్రాంతికి బాలయ్య - వెంకటేష్ పోటీపడ్డారు .. అయితే అందులో రెండుసార్లు వెంకటేష్ పై చేయి సాధించడం విశేషం. అందుకే వెంకటేష్ ను తక్కువ అంచనా వెయ్యకూడదని బాలయ్య అభిమానులు కామెంట్లు చేస్తున్నారు .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది.. ఫ్యామిలీ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ చాయిస్ అని కూడా అంటున్నారు. బాలయ్య డాకు మారాజ్ సినిమాను మాస్ దర్శకుడు బాబి తెర్కకేస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమాపై చిత్రం యూనిట్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది .. మరి ఈ ఇద్దరు సీనియర్ హీరోలు సంక్రాంతికి ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.