సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీ తేజ్‌ ను పరామర్శించారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. ఈ సందర్భంగా తొక్కిసలాటలో గాయపడిన శ్రీ తేజ్‌ ఆరోగ్యంపై సంచలన ప్రకటన చేశారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. కచ్చితంగా కోలుకోవాలని కోరుకుంటున్నా అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మృత్యుంజయ హోమం నా స్వంత ఖర్చుల తో చేస్తానని ప్రకటన చేశారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.

వారి పాప కు రెండు లక్షలు ఇస్తున్నానని భరోసా కల్పించారు. సినిమాలకు ముహూర్తాలు నేను పెట్టానని గుర్తు చేశారు. అందుకే ఒక సినిమా వాడినే అందుకే నేను కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నానని తెలిపారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.. వారం రోజుల్లో మృత్యుంజయ హోమం చేస్తానంటూ ప్రకటన చేశారు. జాతకాలను బట్టి అన్ని జరుగుతాయని వెల్లడించారు.


అల్లు అర్జున్ జాతకంలో  అలా ఉంది కాబట్టి జరిగిందని తెలిపారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. మార్చి నెల వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదని బాంబ్‌ పేల్చారు. ఎవ్వరూ కావాలని చెయ్యరు... ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు జరుగుతాయని తెలిపారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. శ్రీ తేజ పైన వారి తండ్రి చెయ్యి వేయగానే కళ్ళ లోంచి నీళ్ళు వచ్చాయి...కోలుకుంటాడు అని నమ్మకం ఉందన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.

అటు జాని మాస్టర్ మాట్లాడుతూ.. శ్రీ తేజ నీ పరామర్శించేందుకు వచ్చానని తెలిపారు. ఇప్పుడే ఆక్టివ్ అవుతున్నాడన్నారు. బాబు లో కదలికలు వస్తున్నాయని జానీ మాస్టర్‌ వివరించారు. వారి కుటుంబానికి మేము అండగా ఉంటామని ప్రకటించారు.. అందరికీ వచ్చి చూడాలని ఉంటుందన్నారు  జానీ మాస్టర్.  కానీ కొన్ని పరిధులు ఉంటాయి కాబట్టి రాలేకపోతున్నామన్నారు.  నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడలేను అంటూ వ్యాఖ్యానించారు జానీ మాస్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి: