అయితే అల్లు అర్జున్ మాత్రం ఊహించని చిక్కుల్లో ఇరుక్కుని అల్లాడిపోతున్నాడు . సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ 11 నిందితుడిగా అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బెయిల్ పై బయటకు వచ్చాడు . అయితే అల్లు అర్జున్ చేసిన కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల మళ్ళీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు ప్రముఖులు . అయితే అల్లు అర్జున్ ఇష్యులో ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారు పోలీసులు . మరి ముఖ్యంగా అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ - సంధ్యా థియేటర్ ఓనర్స్ - సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ - పుష్ప 2 ప్రొడ్యూసర్స్ ..మైత్రి మూవీ మేకర్స్ ..అదే విధంగా అల్లు అర్జున్ బౌన్సర్స్ ..అందరూ కూడా టార్గెట్ అయ్యారు .
సోషల్ మీడియాలో అయితే ఏకంగా రష్మిక మందన్నాను.. శ్రీ తేజ తండ్రికి ఇచ్చి పెళ్లి చేయాలి అంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు. అయితే ఈ అల్లు అర్జున్ ఇష్యూలో మొత్తంగా అందరూ పుష్ప2 టీం ఇరుక్కుంది . కానీ శ్రీలీల మాత్రం సేఫ్ గా ఉండిపోయింది . శ్రీలీల పై ఒక్కటంటే ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు. అసలు శ్రీ లీల ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయింది . అదే ఇప్పుడు ఆమెకు ప్లస్ గా మారింది అంటున్నారు జనాలు . శ్రీలీల కూడా ఈ ఇష్యూలో ఇరుక్కుంటే కెరీర్ నాశనం అయిపోయుండేది అని చాలా పక్కాగా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది అని మాట్లాడుకుంటున్నారు జనాలు..!