తెలుగు అమ్మాయిలు గ్లామరస్ గా కనిపించేందుకు ఇష్టపడరు .. అందుకే ముంబాయి ముద్దుగుమ్మలను హీరోయిన్ల గా పెట్టుకుంటున్నాం అంటారు టాలీవుడ్ మేకర్స్ .. ఇకనుంచి ఇలాంటి సాకులు చెప్పే అవకాశం ఇవ్వమంటున్నారు ఇప్పటి తరం తెలుగు అమ్మాయిలు .. గ్లామర్ విషయంలో ముంబాయి భామలకు మేము తక్కువ కాదని సిగ్నల్స్ ఇస్తున్నారు. ప్రధానంగా సెకండ్ ఇన్నింగ్స్ లో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న మెగా డాక్టర్ నిహారిక కొణిదెల కూడా ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు .. త్వరలోనే ప్రేక్షకుల‌ ముందుకు రాబోతున్న కోలీవుడ్ మూవీలో గ్లామర్ రోలో ఇరగదీశారు. మద్రాస్కారన్‌ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో గ్లామర్ రోల్‌లో ఆడియన్స్ కు షాక్ ఇచ్చేందుకు నిహారిక రెడీ అవుతున్నారు .. ఇక మరోవైపు ప్రొడ్యూసర్ గాను తన మార్కు చూపిస్తున్నారు మెగా డాటర్.


ఎంతోకాలంగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న .. స్టార్ హీరోయిన్గా ప్రూవ్ చేసుకోలేకపోతున్న తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా . .. వెండితెర మీద హోమ్లి క్యారెక్టర్స్ మాత్రమే చేసిన ఈషా రెబ్బా .. సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫొటోస్ తో రచ్చ లేపుతుంది .. ఈ హాట్ ఫోటో షూట్ చూసైనా తనకు గ్లామర్ హీరోయిన్ రోల్స్ ఇస్తారేమో అన్న ఆశతో ఈ ముద్దుగుమ్మ ఎదురుచూస్తుంది. కెరియర్ మొదటి నుంచి గ్లామర్ హీరోయిన్ ఇమేజ్ను కంటిన్యూ చేస్తున్న మరో తెలుగు అమ్మాయి ప్రియాంక జవాల్కర్‌ .. రౌడీ హీరో విజయ్ దేవరకొండకు జంటగా టాక్సీవాలా సినిమాలో నటించిన ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ తో పాటు గ్లామర్ లుక్కుని కూడా రివిల్ చేసింది. అయినా కూడా ఈ తెలుగు బ్యూటీ కి సరైన అవకాశాలు మాత్రం రావట్లేదు.


ఈ రూల్స్ అన్నిటిని బ్రేక్ చేసిన ఒకే ఒక్క తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల .. మోడలింగ్ రంగం నుంచి వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన శోభిత .. తెలుగు సినిమాలతో పాటుగా బాలీవుడ్ లో కూడా బిజీ హీరోయిన్గా మారింది .. మిస్ ఇండియా టైటిల్ విన్నర్ కూడా కావటంతో ఈ భామ గ్లామర్ సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో శోభితకు వరుస అవకాశాలు ఇచ్చారు నార్త్ మేకర్స్. ఇలా ఇప్పుడు తెలుగు హీరోయిన్లు మూంబాయి హీరోయిన్లను మించిపోయే అందంతో గ్లామర్ పాత్రులకు సై అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: