శ్రీ తేజ్ కుటుంబానికి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అండగా ఉన్నారు. బుధవారం కిమ్స్ హాస్పిటల్ కి వేణు స్వామి వచ్చి రేవతి భర్త భాస్కర్ ను కలిసి మాట్లాడారు. అనంతరం 2 లక్షల రూపాయల చెక్కును తన వంతు ఆర్థిక సహాయంగా ఇచ్చారు. శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాబు కోసం ఈ వారంలో మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తానని వేణు స్వామి అన్నారు.


2 లక్షల రూపాయలు భాస్కర్ కుటుంబానికి నేను ఇస్తున్నాను. ఇదంతా శని ప్రభావం వల్ల అల్లు అర్జున్ ఇలాంటి సంఘటన ఎదురయింది. అతని జాతకం వచ్చే సంవత్సరం మార్చి 29 వరకు అస్సలు బాగోలేదు అల్లు అర్జున్ కాస్త జాగ్రత్తగా ఉండాలని వేణు స్వామి అన్నారు. ఎవరు కూడా కావాలని ఇలాంటి తప్పులు చేయరు. ప్రతి ఒక్కరూ తప్పులు చేయడం చాలా సహజం శ్రీ తేజ్ పైన వారి తండ్రి చెయ్యి వేయగానే అది చూసి నా కళ్ళలో నీళ్లు వచ్చాయి.


అతడు కోలుకుంటాడని నాకు చాలా నమ్మకం ఉంది. కచ్చితంగా శ్రీ తేజ్ కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తానని వేణు స్వామి అన్నారు. శ్రీ తేజ్ కు మృత్యుంజయ హోమం నిర్వహిస్తాం. పాపకు రెండు లక్షల ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నాను. నేను టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు ముహూర్తాలు పెట్టడం జరిగిందని వెల్లడించారు వేణు స్వామి. కాబట్టి నేను కూడా సినిమా వాడినే. అందుకే శ్రీ తేజ్ కుటుంబానికి సహాయం చేస్తున్నాను. వారం రోజుల్లో హోమం కచ్చితంగా నిర్వహిస్తారు.


ఆ అబ్బాయికి ఏమీ జరగదు అని వేణు స్వామి అన్నారు. కాగా, జాతకాలను బట్టి ఇదంతా జరుగుతుందని వేణు స్వామి వెల్లడించాడు. అల్లు అర్జున్ జాతకంలో శని ఉండడం వల్ల ఇలా జరిగిందని వేణు స్వామి అన్నారు. వచ్చే సంవత్సరం మార్చి వరకు అసలు బాగోలేదని బాంబు పేల్చాడు. దీంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ అభిమానులు ఆశ్చర్యంలో ఉన్నారు. మరి వేణు స్వామి మాటలను నమ్మి అల్లు అర్జున్ ఏమైనా పూజలు చేయించుకుంటే బాగుంటుందని కొంతమంది సలహాలు ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: