డబ్బులు ఇచ్చినా కూడా కౌశిక్ తల్లి నాటాకాలు ఆడిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఇటీవల దేవర సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా... తనకు సంబంధించిన ఒక ఫ్యాన్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు... ఓ వార్త బయటికి వచ్చింది.


దీంతో వెంటనే స్పందించిన జూనియర్ ఎన్టీఆర్... తన అభిమానికి సహాయం చేస్తానని ప్రకటించాడు. ఆసుపత్రి బిల్లు కూడా... కడతానని హామీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే జూనియర్ ఎన్టీఆర్... తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని.. ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ తల్లి సంచలన  ఆరోపణలు చేసింది. తాజాగా కౌశిక్ ఆస్పత్రి బిల్లు కట్టి.. డిశ్చార్స్‌ చేయించింది ఎన్టీఆర్‌ టీం.



ఈ తరుణంలోనే... ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఎన్టీఆర్‌ ఫ్యాన్‌ అయిన కౌశిక్ తల్లి దగ్గర డబ్బులు ఉన్నా ఆమె ఆసుపత్రికి కట్టలేదని ఆగ్రహించాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు.  చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అంతా పూర్తి అయ్యాక  ఫైనల్ బిల్లు రూ.60 లక్షలు అయిందని గుర్తు చేశాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు.


అందులో ఏపీ ప్రభుత్వం, టీటీడీ ఇచ్చిన రూ.51 లక్షలు కౌశిక్ తల్లి  సరస్వతి ఆసుపత్రికి చెల్లించగా ఇంకో రూ.9 లక్షలు బిల్లు పెండింగ్ లో ఉందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా బయట ఇంకో  రూ.13 లక్షలు పోగేసి కౌశిక్ తల్లికి ఇచ్చామని వెల్లడించారు. అందులో రూ.9 లక్షలు కడితే అయిపోయేదని పేర్కొన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు. అసలు ఆమె ఎందుకు అలా మాట్లాడిందో తెలియదని వెల్లడించారు. మేము ఆసుపత్రికి వెళ్లి డిశ్చార్జ్ కు అన్ని ఏర్పాట్లు చేసి దగ్గరుండి ఇంటికి పంపించామన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: