అక్కినేని నాగార్జున కుటుంబంలో చాలా రోజుల తర్వాత పండగ వాతావరణం నెలకొంది. అక్కినేని హీరో నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల డిసెంబర్ 5వ తేదీన వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కినేని హీరో నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో హీరో నాగచైతన్య శోభితల వివాహం జరిగింది.


చాలా సంవత్సరాల నుంచి అక్కినేని నాగచైతన్య, శోభిత ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచి పెళ్లి పీటల వరకు తీసుకువచ్చారు. వీరిపై ఎన్నో రకాల రూమర్స్ వచ్చినప్పటికీ ఒక్కసారి కూడా ఆ వార్తలపై రియాక్ట్ అవలేదు. ఇక శోభిత, నాగచైతన్య వివాహం తర్వాత ఇద్దరు కూడా సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. షూటింగ్ పూర్తయితే హనీమూన్ ట్రిప్ కి వెళ్లాలని ప్లాన్ లో ఉన్నారట.


కాగా, హీరో నాగార్జున తన కోడలు శోభితపై కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. నాగచైతన్యకు పరిచయం కాకముందే శోభిత తనకు తెలుసని  అన్నారు అక్కినేని నాగార్జున. శోభిత చాలా మంచి అమ్మాయి. అంతేకాకుండా అందమైన అమ్మాయి అంటూ కొనియాడారు అక్కినేని నాగార్జున. ఆమె చైతన్య జీవితంలోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందంటూ అక్కినేని నాగార్జున అన్నారు. నాగార్జున చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇక అటు ఇటీవలే అక్కినేని హీరో నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహం అయినపోయిన తర్వాత కూడా శోభిత దూళిపాళ్ల కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.  తనకు అక్కినేని నాగార్జున కుటుంబం ఎప్పుడో తెలుసని... వాళ్లతో పరిచయాలు ఉన్నట్లు వెల్లడించింది. ఇక అదే సమయంలో.. సమంత విడాకులు కూడా అయ్యాయట. దీంతో అక్కినేని హీరో నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల కు లైన్‌ క్లియర్‌ అయింది.  ఇక ఇప్పుడు ఈ జంట కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: