టాలీవుడ్ డైరెక్టర్లలో డైరెక్టర్ బాబి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించడానికి ఆలోచిస్తూ ఉంటారు. జై లవకుశ, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న బాబి ఈ ఏడాది బాలకృష్ణతో కలిసి డాకు మహారాజ్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా వచ్చేయేడది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సందర్భంగా చిత్ర బృందం కూడా ప్రమోషన్స్ని మొదలుపెట్టారు. ఈ చిత్రంలో బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన బాబీ డియోల్ ని తీసుకురావడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాబీ డియోల్ గురించి  ఎవరికీ తెలియని కొన్ని విషయాలను బయట పెట్టడం జరిగింది డైరెక్టర్ బాబి.



ఇంటర్వ్యూలో బాబీ డియోల్ గురించి మాట్లాడుతూ.. యానిమల్ సినిమాకి ముందు డాకు మహారాజు కథ బాబీ డియోల్ కి చెప్పానని.. కానీ యానిమల్ సినిమా తర్వాత ఒక స్టార్ యాక్టర్ గా మారిపోయారు దాని వెనక చాలా ఎమోషనల్ కథ ఉందంటూ తెలిపారు.. ఒకసారి ఆయన కొడుకే వాళ్ళ అమ్మతో నాన్న ఇంకా పనిచేయడా అనే ప్రశ్నలు అడిగారని ఈ ప్రశ్నలు బాబి డియోల్  విన్నాడట.. అలా విన్న తర్వాత సూసైడ్ చేసుకుందామనుకున్నారట. కానీ సినిమాలు లేక దాదాపుగా 15 ఏళ్ల అవుతున్న సమయంలో ఇంట్లో కూర్చొని భార్య డబ్బులతో బ్రతుకుతూ ఉండేవాడట.



అయితే ఆ సమయంలోనే ఒక తెలుగోడు సందీప్ రెడ్డి వంగ తన లైఫ్ లోకి వచ్చి తన జీవితాన్నే మార్చేశారని ఎమోషనల్ గా డైరెక్టర్ బాబీ తో చెప్పారట.. కానీ ఇప్పుడు బాబీకి అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది. డాకు మహారాజ్ చిత్రంలో బాలయ్యకు సమానంగానే బాబీ డియోల్ పాత్ర ఉంటుంది అంటు తెలియజేశారు. మొత్తానికి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డైరెక్టర్ సందీప్ రెడ్డి పేరుని బాబీ డియోల్ చెబుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: