టికెట్ ధరలు పెంచి కొత్త సినిమా విడుదలైనప్పుడు ఎక్కువగా సినిమా చూసే కాలేజీ స్టూడెంట్స్ ... యువకులు ... మాస్ నుంచి అత్యధిక వసూలు చేయడం బాధాకరంగా ఉంది. అన్ని సినిమాలకు నిర్ణీత మొత్తంలోనే టికెట్ ధరలు ఉండేలా ? చూడాలని వారి కోరుతున్నారు. ఇలా చేస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మరికొన్ని సంవత్సరాలపాటు ప్రాణం పోసినట్టు అవుతుందని ... ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమా చూసి డబ్బులు రావాలి అనుకోవాలి కానీ ... తక్కువ ప్రేక్షకులతో ఎక్కువ డబ్బులు వసూలు చేయాలన్న నిర్మాతలు నిర్వచనం సరి కాదని చెబుతున్నారు.
ఇలా అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేట్లు పెంచడం అనేది చిన్న సినిమాలకు చాలా ప్లస్ అవుతుందని చెబుతున్నారు. డబ్బున్న ప్రేక్షకులు మల్టీప్లెక్స్ లో సినిమాలు చూస్తారు .. అక్కడ సౌకర్యాలకు అనుగుణంగా ధరలు పెంచుకున్న పర్వాలేదు .. మధ్య తరగతి వాళ్ళు సింగిల్ స్క్రీన్ లకు వస్తారు. ఇక్కడ టికెట్ ధర 500 పెడితే ఎవరు రావటం లేదు .. సీఎం రేవంత్ రెడ్డి సింగిల్ స్క్రీన్ థియేటర్ల వాళ్ళు అందరూ సంతోషపడే నిర్ణయం తీసుకున్నారు అని తెలంగాణలో ఎగ్జిబిటర్లు .. డిస్ట్రిబ్యూటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.