తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇండస్ట్రీ పెద్దలందరూ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు రాబోతున్నారు. ఈ మేరకు అన్ని చర్చలు జరగబోతున్నాయి. అల్లు అర్జున్ అరెస్టు వివాదం, మోహన్ బాబు ఇష్యూ, అలాగే అక్కినేని నాగార్జున వివాదం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో... ఇండస్ట్రీకి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి గ్యాప్ పెరిగింది.


ఇక ప్రభుత్వంతో తలపడలేక.... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలకు సిద్ధమైంది టాలీవుడ్ ఇండస్ట్రీ. ఇవాళ ఉదయం 10:00 సమయంలో బంజర హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో... సీఎం రేవంత్ రెడ్డి తో పాటు టాలీవుడ్ పెద్దలు సమావేశం కాబోతున్నారు.  ఈ సమావేశం నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజ్, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అల్లు అరవింద్ తోపాటు నిర్మాతలు దర్శకులు రాబోతున్నారు.

 
అయితే బడా హీరోలు చిరంజీవితో పాటు  వెంకటేష్ వస్తున్నప్పటికీ... అక్కినేని నాగార్జున మాత్రం ఈ సమావేశానికి డుమ్మా కొట్టబోతున్నారట. ఆయనను ఆహ్వానించినప్పటికీ... తాను హైదరాబాదులో లేనని నాగార్జున చెప్పడం జరిగిందని వార్తలు వస్తున్నాయి.  దీంతో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఒక్క హీరో లేకుండానే ఈ సమావేశం జరగనుంది. వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం, అక్కినేని నాగార్జున మధ్య మొదటి నుంచి గొడవలు ఉన్న సంగతి తెలిసిందే.

 
మొదట హైడ్రా తీసుకు వచ్చిన తర్వాత.. అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది రేవంత్ రెడ్డి సర్కారం. ఆ తర్వాత హీరోయిన్ సమంత అలాగే అక్కినేని నాగార్జున  కుటుంబం పైన మంత్రి కొండ సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలోనే ఉంది. దీంతో అక్కినేని నాగార్జున అలాగే రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగిపోయింది. ఇది మనసులో పెట్టుకుని అక్కినేని నాగార్జున ఈ సమావేశానికి రాలేకపోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: