మనకు తెలిసిందే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది . శ్రీతేజ్  అనే అబ్బాయి చాలా దారుణంగా గాయపడ్డాడు . మరీ ముఖ్యంగా హాస్పిటల్ లో ఇప్పటికీ అడ్మిట్ అయ్యి చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.  అయితే అల్లు అర్జున్ ఫ్యామిలీ అదేవిధంగా పుష్ప2 టీం ఆయనను 24 గంటలు మానిటరింగ్ చేస్తూ ఆయన ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు . అవసరమైతే ఫారిన్ నుంచి డాక్టర్స్ ను కూడా పిలిపించే పనిలో ఉన్నారు అల్లు అర్జున్ .


అయితే తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఈ విషయాన్ని అంత ఈజీగా తీసుకోవడం లేదు.  మీకు పర్మిషన్ లేకపోయినా ఎందుకు రోడ్ షో చేశారు..? మీ బౌన్సర్లు ఎందుకు అంతలా జనాలని దారుణంగా తోసేశారు ..? అంటూ ఫైర్ అవుతున్నారు.  అయితే శ్రీ తేజ్ కోసం రెండు కోట్లు పరిహారం చెల్లించారు అల్లు అర్జున్ అండ్ పుష్ప టీం అన్న విషయం అందరికీ తెలుసు. ఆ బాబుకు ఉపయోగపడే విధంగా ఆ డబ్బుని  ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఫ్యూచర్లో బాబుకు ఉపయోగపడే విధంగా ప్లాన్స్ చేస్తున్నారట .



అంతేకాదు శ్రీతేజ్ తండ్రికి ఉద్యోగం కూడా ఇచ్చేలా మాట్లాడుకున్నారు. అయితే రెండు కోట్లు కాదు మూడు కోట్లు కాదు 10 కోట్లు కాదు ఆ బిడ్డకి ఇచ్చిన తక్కువే. ఆ బిడ్డకి అమ్మలేదు అమ్మ లేకుండా లైఫ్ అసలు ఊహించుకోలేరు.  నిజంగా అల్లు అర్జున్ సరైన న్యాయం శ్రీ తేజకు చేయాలి అంటే అల్లు అర్జున్ ఆ బిడ్డను దత్తత తీసుకోవాలి .. అల్లు అర్జున్ తన కొడుకుగా బిడ్డను పెంచుకోవాలి అంటూ జనాలు సజెషన్స్ ఇస్తున్నారు .



అయితే ఇది చాలా దారుణం అంటూ కొంత మంది ఫ్యాన్స్ కౌంటర్స్ వేస్తున్నారు. అల్లు అర్జున్ కావాలని ఏదీ చేయలేదు.. పొరపాటున జరిగింది.. దానికి పరిహారంగా అల్లు అర్జున్ చాలా ఎక్కువగానే అబ్బాయికి సహాయం చేస్తున్నాడు . ఆ అబ్బాయి కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.  కానీ ఈ విధంగా అల్లు అర్జున్ కొడుకుగా ..అల్లు అర్జున్ ఆ బిడ్డని దత్తత తీసుకోవాలి అని డిమాండ్ చేయడం ఎంతవరకు న్యాయమంటున్నారు ఫాన్స్..? దీంతో సోషల్ మీడియాలో మళ్లీ బన్నీ పేరు ట్రీల్లింగ్ కి గురి అయ్యేలా చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: