పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ ఇప్పటివరకు ఎన్నో రీమిక్ సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి కొంత భాగం పూర్తి అయిన తర్వాత పవన్ తన ఫోకస్ ను పూర్తిగా రాజకీయాలపై పెట్టడంతో ఈ సినిమా షూటింగ్ ను ఆపేశాడు. ఇక ఇప్పటికే పవన్ రాజకీయాల్లో అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని కీలక పదవుల్లో కూడా కొనసాగుతున్నాడు. పవన్ మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు బల్క్ డేట్స్ ఇవ్వనున్నట్లు , దానితో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తమిళ సినిమా అయినటువంటి తేరి కి రీమేక్ గా రూపొందబోతునట్లు అనేక వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా తేరి మూవీ కి అధికారిక రీమేక్ గా హిందీ లో వరుణ్ ధావన్ హీరోగా బేబీ జాన్ అనే మూవీ ని రూపొందించారు. ఈ మూవీ ని నిన్న అనగా డిసెంబర్ 25 వ తేదీన విడుదల చేశారు. ఇక ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

ఒరిజినల్ సినిమా అయినటువంటి తేరి కథను ఏ మాత్రం మార్చకుండా యాక్షన్ సన్నివేశాలను మాత్రం చాలా భారీగా తీసినట్లు తెలుస్తుంది. దానితో ఈ మూవీ కి హిందీ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి పవన్ కూడా ఒక వేళ తేరి సినిమాను రీమేక్ చేస్తున్నట్లయితే వరుణ్ ధావన్ ను ఫాలో అయ్యి మంచి మంచి చేంజెస్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలను జనం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: