ఈ మధ్యకాలంలో సినిమాలకు ప్రమోషన్స్ ఎలా నిర్వహించుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాము.  మరి ముఖ్యంగా రీసెంట్గా పుష్ప2 సినిమాకి ప్రమోషన్స్ నిర్వహించడానికి చాలా చాలా తిప్పలు పడ్డారు మేకర్స్. ఆ తిప్పల్లో ఎక్కువగా లీగల్ గా చిక్కులు కూడా ఎదురుక్కోవాల్సి వచ్చింది . ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు అందరు  మెగా ఫ్యాన్స్ ఎదురుచూసే మూవీ గేమ్ చేంజెర్.  ఈ సినిమా కోసం అందరూ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు .


రామ్ చరణ్ కెరియర్ లో చాలా చాలా స్పెషల్గా ఈ మూవీ తెరకెక్కింది . ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ శంకర్  చాలా చాలా డిఫరెంట్గా తెరకెక్కించారు. చాలా కొత్త యాంగిల్ లో చరణ్ ని చూపించబోతున్నాడు . రామ్ చరణ్ చాలా న్యూ లుక్స్ లో దర్శనమివ్వబోతున్నాడు అని సినిమా నుంచి  రిలీజ్ అయిన పిక్చర్స్ ఆధారంగా తెలుస్తుంది . అయితే జనవరి 10వ తేదీ సినిమా రిలీజ్ కాబోతుంది . పాన్ ఇండియా లెవల్ లో..తెరకెక్కిన ఈ సినిమా ఆ రేంజ్ లోనే రిలీజ్ కాబోతుంది.



సినిమా ప్రమోషన్స్ కూడా ఆ రేంజ్ లోనే చేస్తారు అనుకున్నారు అంతా. కానీ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్లో అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు రామ్ చరణ్ . ఆ మాటకొస్తే మూవీ టీం ఎవ్వరు కూడా సినిమాని ప్రమోట్ చేసుకోవడం లేదు.  సాధారణంగా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడింది అంటే మూవీ టీం హంగామా చేస్తుంది. అది అందరికీ తెలుసు కానీ ఎందుకు గేమ్ చేంజర్ మూవీ టీం మాత్రం అస్సలు ప్రమోషన్స్ పై ఇంట్రెస్ట్ చూపించడం లేదు . రామ్ చరణ్ కూడా లైట్ గా తీసుకున్నాడు . ఈ సినిమా కంటెంట్ అలాంటిది . హిట్ అవుతుంది అని నమ్మకం అంతా కాన్ఫిడెంట్ క్రియేట్ చేసింది అంటున్నారు మెగా అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: