టాలీవుడ్ డ్యాసింగ్ క్వీన్ శ్రీలీల మొదట్లో చాలా లక్కీ అనిపించింది కానీ రాను రాను అమ్మడికి బ్యాడ్ లక్ చాలా ఎక్కువైంది. ధమకా హిట్ తో ఒకేసారి అరడజను సినిమాల దాకా రాగా అందులో ఏది ఆమె ఇమేజ్ ని డబుల్ చేసేలా ఉపయోగపడలేదు. జస్ట్ బాలయ్యతో చేసిన భగవంత్ కేసరి పర్వాలేదు అనిపించగా గుంటూరు కారం జస్ట్ ఓకే అనిపించినా అవి కెరీర్ కి ప్లస్ కాలేదు. ఇక పుష్ప 2 లో కిసిక్ సాంగ్ మీద భారీ అంచనాలు పెట్టుకోగా ఆ సాంగ్ కన్నా రష్మిక పీలింగ్ సాంగే ఎక్కువ హిట్ అయ్యింది.

ఇవన్నీ షాకులతో సతమతమవుతున్న శ్రీలీలకు ఇంకా పెద్ద షాక్ తగులుతున్నాయి. ఎందుకంటే ఆమె దాదాపు ఓకే అనుకున్న సినిమాలు కాస్త ఆమె చేతుల నుంచి వెళ్లిపోతున్నాయి. ఆల్రెడీ ఇదివరకు అలా ఒకసారి జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. యువ హీరో నవీన్ పొలిశెట్టి చేస్తున్న అనగనగా ఒకరాజు సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో ముందు శ్రీలీలని హీరోయిన్ అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లో మీనాక్షి చౌదరిని తీసుకుంటున్నారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ సినిమా నుంచి కూడా డేట్స్ ఇష్యూ వల్ల శ్రీలీల తప్పుకుంది. ఇదే కాదు బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో చేయాల్సిన సినిమా కూడా శ్రీలాని తీసి పూజా హెగ్దేని ఫిక్స్ చేశారు. ఇలా తన దాకా వచ్చి మిస్ అవుతున్న సినిమాల గురించి శ్రీలీల ఎలా ఫీల్ అవుతుందో కానీ ఎందుకు ఇలా అవుతుంది అని ఆడియన్స్ అనుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీలీల రవితేజతో ఒక సినిమా చేస్తుండగా పవర్ స్టార్ తో ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా నటిస్తుంది. నితిన్ రాబిన్ హుడ్ లో కూడా అమ్మడు నటిస్తున్న విషయం తెలిసిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: