కొంతమంది హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ చేయకపోయినా క్రేజ్ తెచ్చుకుంటారు. సాయి పల్లవి లాంటి కథానాయికలు అసలు స్కిన్ షో చేయకపోయినా వారిని ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ కొంతమంది హీరోయిన్స్ వారికి గ్లామర్ షోతోనే క్రేజ్ రాగా అలాంటి వారు వాటిని కాదని కొత్తగా ట్రై చేస్తే మాత్రం సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐతే ఆడియన్స్హీరోయిన్స్ గ్లామర్ రోల్సే నచ్చుతున్నా వచ్చిన ఏదో ఒక ఛాన్స్ చేసేద్దామని చేస్తుంటారు.

బుట్ట బొమ్మ పూజా హెగ్దే పరిస్థితి ఇప్పుడు అలానే మారింది. రాధే శ్యాం తర్వాత ఒక్క సౌత్ సినిమా ఛాన్స్ అందుకోలేదు. గుంటూరు కారం నుంచి ఎగ్జిట్ అవ్వడం అవ్వడం రెండేళ్ల దాకా ఆమెను పలకరించలేదు. ఐతే ఈమధ్యనే మళ్లీ కోలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయి. సూర్య 44 రెట్రో సినిమాలో పూజా హెగ్దే నటిస్తుంది. ఈ సినిమాలో పూజా సూర్య లవర్ గా చేస్తుంది.

సినిమా టీజర్ లో చూస్తే ఆమె కాస్త డీ గ్లామరస్ రోల్ చేసినట్టు అనిపిస్తుంది. తెర మీద పూజా థై షో కి సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆమె మాత్రం సూర్య రెట్రోలో సింపుల్ గా గ్లామర్ రోల్ కాకుండా ఒక మిడిల్ ఏజ్ గర్ల్ రోల్ చేస్తున్నట్టు ఉంది. మరి ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది అన్నది తెలియదు కానీ పూజా ఫ్యాన్స్ మాత్రం రెట్రో టీజర్ చూసి ఇదేంటి పూజా బేబీ ఇలా మారిపోయింది అని ఆశ్చర్యపడుతున్నారు. ఏది ఏమైనా పూజా గ్లామర్ షో చేస్తేనే ఆమె ఫ్యాన్స్ కి పండగ అన్నట్టు చెప్పొచ్చు. మరి సూర్య రెట్రో చూశాక పూజా మీద ఆడియన్స్ లో ఉన్న ఒపీనియన్ మారుతుందా.. పూజా ఇక మీదట గ్లామర్ కన్నా పాత్ర ప్రాధాన్యతని బట్టే చేస్తుందా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: