ఈసినిమాకు సంబంధించిన పాటలకు మిశ్రమ స్పందన రావడంతో ఎంతవరకు ఈమూవీ ఆశించిన స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుంది అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈనెల 30న విడుదలకాబోతున్న ఈమూవీ ట్రైలర్ కు వచ్చే స్పందనను బట్టి ఈమూవీ విజయాన్ని అంచనా వేయవచ్చు అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీ ట్రైలర్ ను అభిమానుల మధ్య విడుదల చేయాలని పక్కా ప్లాన్ తో ఉన్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ కు చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్నాడని అంటున్నారు. ఈ ఈవెంట్ తరువాత జనవరి మొదటి వారంలో రాజమండ్రిలో ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను భారీ స్థాయిలో ఏర్పాటు చేసి ఆ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిధిగా తీసుకు రావాలని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్.
గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సంధ్యా ధియేటర్ ప్రీమియర్ షోకు సంబంధించిన సంఘటన పై జరిగిన వివాదాలు ట్విస్ట్ లు నిర్మాత దిల్ రాజ్ ఎంటర్ కావడంతో ఒక కొలిక్కి వచ్చినట్లు సంకేతాలు వస్తున్నాయి. అంతేకాదు ఎప్పటిలాగే సంక్రాంతి సినిమాల టికెట్ల రేట్ల పెంపుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించే విధంగా దిల్ రాజ్ రాయబారాలు నడుపుతున్న నేపధ్యంలో సంక్రాంతి సినిమాల మార్కెటింగ్ కు అదేవిధంగా టిక్కెట్ల రేట్ల అడ్డు ఉండకపోవవచ్చు అని అంటున్నారు..