కాలీవుడ్ టాప్ హీరో సూర్య ‘కంగువ’ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ కోసం రెండు సంవత్సరాలు మరో సినిమా చేయకుండా ఎంతో కష్టపడ్డాడు. అయితే ఆ కష్టం అంతా ‘కంగువ’ ఘోర పరాజయంతో వృధా అయిపోయింది. కోలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో అత్యంత భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో ఆ పరాజయాన్ని సూర్య తో పాటు అతడి అభిమానులు కూడ తట్టుకోలేకపోయారు.



ఇలాంటి పరిస్థితుల మధ్య క్రిస్మస్ రోజున విడుదల అయిన సూర్య కార్తీక్ సుబ్బరాజుల లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ ట్రైలర్ సూర్య అభిమానులకు మాత్రమే కాకుండా అందరికీ నచ్చడంతో ఈ సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ టీజర్ లో ఈ మూవీ కథ ఏమిటో రేఖా మాత్రంగా దర్శకుడు తెలియచేశాడు. పేరు మోసిన ఒక డాన్ కొడుకు తండ్రి మాఫియా వారసత్వాన్ని కొనసాగిస్తూ హింస రక్తపాతం మధ్య జీవిస్తూ ఉంటాడు.



ఇంతలో అతడికి ఒక అందమైన అమ్మాయి పరిచయం కావడంతో ఆ అమ్మాయి ప్రేమ కోసం అన్నీ వదిలేసి ఒక మాములు మనిషిగా మారాలని ప్రయత్నిస్తాడు. అయితే అతడి గత జీవితం ఆ ప్రయత్నాలకు సహకరించదు. ఈ పాయింట్ చుట్టూ అల్ల బడిన కథ ‘రెట్రో’ కథ పరంగా ఇలాంటి సినిమాలు ఇప్పటికే ఎన్నో వచ్చినప్పటికీ ఈ మూవీ టేకింగ్ తో పాటు సూర్య లుక్ అదేవిధంగా కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ ఈమూవీ పై అంచనాలు పెంచుతున్నాయి.



సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది అనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకుల నుండి దూరమై ఇప్పుడు తమిళ ప్రేక్షకులను నమ్ముకున్న పూజా హెగ్డే హోమ్లీ లుక్స్ లో అమాయకంగా కనిపిస్తూ ఉండటంతో తిరిగి ఈమూవీతో ఆమె గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారే ఆస్కారం కనిపిస్తోంది. 2025 సమ్మర్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈమూవీతో తిరిగి ట్రాక్ లోకి సూర్య వస్తాడని అభిమానుల ఆశ..  



మరింత సమాచారం తెలుసుకోండి: