తెలుగు సినీ పరిశ్రమ లో సూపర్ సాలిడ్ కలిగిన హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు . విక్టరీ వెంకటేష్ ఎక్కువ శాతం తన కెరియర్లో ఫ్యామిలీ ఓరియెం టెడ్ సినిమాల లో నటించి ఎన్నో విజయాలను అందుకొని ఫ్యామిలీ ఆడియ న్స్ కు ఎంతగానో దగ్గర అయ్యాడు . ఇకపోతే నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకం గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సి న అవసరం లేదు . బాలయ్య తన కెరియర్ లో ఎక్కువ శాతం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లలో హీరో గా నటిం చి మాస్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే వెంకటేష్ , బాలకృష్ణ ఎన్నో సార్లు సంక్రాంతి బరిలో నిలిచారు. వచ్చే సంవత్సరం కూడా వీరిద్దరూ సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్నారు. ఇకపోతే వెంకటేష్ వల్ల బాలయ్య కు రెండు సార్లు గట్టి స్ట్రోక్ తగిలింది. 2000 వ సంవత్సరం బాలయ్య వంశోద్ధారకుడు అనే సినిమాతో సంక్రాంతి పండగ బరిలో నిలవగా , వెంకటేష్ కలిసుందాం రా సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు. ఈ సంవత్సరం వంశోద్ధారకుడు సినిమా సంక్రాంతికి ఏ మాత్రం ఎఫెక్ట్ చూపలేకపోయింది. కలిసుందాం రా సినిమా మాత్రం భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇక 2019 వ సంవత్సరం బాలకృష్ణ హీరో గా రూపొందిన కథానాయకుడు , వెంకటేష్ హీరో గా రూపొందిన ఎఫ్ 2 సినిమాలు విడుదల అయ్యాయి. ఈ సంవత్సరం కూడా బాలయ్య కు సంక్రాంతి కి చేదు అనుభవం మిగలగా వెంకటేష్ కి మాత్రం బ్లాక్ బాస్టర్ విజయం దక్కింది. మరి వచ్చే సంవత్సరం సంక్రాంతి కి వీరిద్దరి సినిమాలు విడుదల కానున్నాయి. మరి ఏ హీరో ఈ సంవత్సరం పై చేయి సాధిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: