ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొన్నటి వరకు జానీ మాస్టర్ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో మారుమోగిన విషయం తెలిసిందే. లైంగిక కేసు ఆరోపణలో భాగంగా అరెస్టయి జైలుకు వెళ్లడంతో పాటు కొద్దిరోజులు జైల్లోనే గడిపి వచ్చారు ఆ జానీ మాస్టర్. ఆ సమయంలో పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. చాలామంది సెలబ్రిటీలు జానీ మాస్టర్ కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన జానీ మాస్టర్ యధావిధిగా తన పనులు తాను చేసుకుంటూ వెళుతున్నారు.మొన్నటికి మొన్న ఒక సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇది ఇలా ఉంటే జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జానీ మాస్టర్ పై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

అంతేకాదు అందులో పలు కీలక అంశాలు కూడా చేర్చారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు ఆమెను తీసుకెళ్లి, ఆమెపై లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసులు తమ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు జానీ మాస్టర్ గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ.. మహిళ అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇప్పుడు ఆమె మాటలు నిజమేనని తేల్చారు పోలీసులు.ఇదిలావుండగా దీని పై ప్రస్తుతం జానీ మాస్టర్ స్పందించారు. న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉందని నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసులో ఏం జరిగిందనేది నా మనసుకు దేవుడికి తెలుసు ఏదైనా కోర్టు నిర్ణయిస్తుంది. అప్పటివరకు నేను నిందితుడిని మాత్రమే. అభిమానుల ప్రేమ నాపై ఎప్పుడూ ఉండాలని ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: