టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో బాబి ఒకరు. ఈయన రవితేజ హీరోగా రూపొందిన పవర్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను రూపొందించిన విధానానికి గాను బాబీ కి మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కాయి. ఇకపోతే ఈయన పవర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా సర్దార్ గబ్బర్ సింగ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జై లవకుశ , వెంకటేష్ , నాగ చైతన్య హీరోలుగా వెంకీ మామ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్టేరు వీరయ్య సినిమాలను రూపొందించాడు.

ఇందులో జై లవకుశ , వాల్తేరు వీరయ్య సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోగా , వెంకీ మామ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం బాబి , బాలకృష్ణ హీరోగా డాకు మహారాజ్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల దగ్గర పడిన సందర్భంగా బాబి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా బాబ్జీ మాట్లాడుతూ ... సినిమా పేరు చెప్పను కానీ ఓ సినిమా విషయంలో నిర్మాతలు నాకు అనుకున్న స్థాయి బడ్జెట్ ను కేటాయించలేదు. వారు కనుక నాకు అనుకున్న స్థాయి బడ్జెట్ ను కేటాయించి ఉండి ఉంటుంటే ఆ సినిమా అద్భుతమైన స్థాయికి చేరి ఉండేది అని బాబీ చెప్పుకొచ్చాడు. తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: