కమెడియన్ గా ఉన్న వేణు సడెన్ గా మెగా ఫోన్ పట్టి బలగం సినిమా చ్సే సరికి అందరు షాక్ అయ్యారు. సినిమా సూపర్ హిట్ అవడంతో కమెడియన్ వేణు కాస్త డైరెక్టర్ వేణుగా మారిపోయాడు. ఐతే వేణు రెండో సినిమా ఎల్లమ్మ అంటూ చేయబోతున్నాడు. మొదటి సినిమా బలగం హిట్ అయ్యింది అంటే అది ఎలాంటి అంచనాలతో రాలేదు. ముఖ్యంగా సినిమాలో స్టార్ కాస్ట్ లేదు ఓన్లీ ఒక కాన్సెప్ట్ మీద వెళ్లాడు. కానీ రెండో సినిమా అలా కాదు.

ఎల్లమ్మ కి స్టార్ కాస్ట్ ఎంపిక జరుగుతుంది. నితిన్ లీడ్ రోల్ కన్ ఫర్మ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఎల్లమ్మ టైటిల్ రోల్ లో సాయి పల్లవిని తీసుకునే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది. ఐతే కొత్త వాళ్లతో తీసిన బలగం వేణుకి మంచి గుర్తింపు తెచ్చింది. ఐతే సీనియర్స్ తో అంటే ఆల్రెడీ స్టార్స్ అయిన వారితో వేణు ఎలాంటి అవుట్ పుట్ తీసుకుంటాడు అన్నది డౌట్లు మొదలయ్యాయి.

ఎల్లమ్మ వేణుకి పెద్ద ఛాలెంజ్ అని చెప్పడం కాదు అది నిజంగానే పెద్ద ఛాలెంజ్ అని తెలుస్తుంది. నితిన్, సాయి పల్లవి ఉన్నారంటే సినిమాపై అంచనాలు కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. వాటిని నిలబెట్టేలా సినిమా తీయడం అంత ఈజీ థింగ్ కాదు. మరి వేణు ఈ సినిమాను ఎలా ప్లాన్ చేస్తున్నారో కానీ ఎల్లమ్మ సినిమా టైటిల్ తెలిసినప్పటి నుంచి ఆడియన్స్ లో బజ్ మొదలైంది. ఈ సినిమాకు దిల్ రాజు కూడా వేణు అడిగినంత బడ్జెట్ ఇచ్చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎల్లమ్మ బలగం లా కాకుండా భారీ కాన్వాస్ తోనే రాబోతుందని తెలుస్తుంది. ఏది ఏమైనా ఒక హిట్ కొట్టినా కూడా వేణుకి ఈ ప్రాజెక్ట్ తోనే అసలు తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: