ఏది ఏమైనా అది తెరి రీమేకే.. ఐతే లేటెస్ట్ గా బేబీ జాన్ సినిమా కూడా ఆ సినిమా రీమేక్ గా వచ్చింది. ఐతే తెరి సినిమా డైరెక్ట్ చేసిన అట్లీనే హిందీలో ఈ సినిమాకు సపోర్ట్ గా నిలిచాడు. ఐతే తెలుగు సినిమా విషయానికి వస్తే కేవలం అట్లీ ఐడియాని మాత్రమే తీసుకుని మిగతా కథ అంతా కూడా ధశరథ్, హరీష్ శంకర్ కలిసి చేస్తున్నారు.
తెరి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా దాదాపు ఆ సినిమా రూపు రేఖలన్నీ మార్చేస్తారని అనిపిస్తుంది. ముఖ్యంగా పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ కొట్టాక హరీష్ శంకర్ మరోసారి అలాంటి సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఇప్పటివరకు రిలీజైన ప్రోమోలు అన్ని అదుర్స్ అనిపిస్తున్నాయి. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఒక హిట్ సినిమాకు రెండు వేరు వేరు భాషల్లో వేరు వేరు రకాలుగా రీమేక్ అవ్వడం విచిత్రంగా ఉంది. ఐతే తెరి సినిమా తెలుగులో పోలీస్ గా రిలీజ్ కూడా అయ్యింది. మరి ఆ సినిమాను మళ్లీ తీయడం పవర్ స్టార్ ఫ్యాన్స్ కి రుచించట్లేదు.