మనం అనుకున్నట్టు లైఫ్ లేకపోయినా .. అప్పుడప్పుడు చికాకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిన.. కూసింత ట్రాక్ తప్పుతూ ఉన్న .. కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన .. వెంటనే ఇంట్లోని పేరెంట్స్ లేదా ఇంట్లోని పెద్దవాళ్లు జాతకం బాగోలేదు అంటూ పండితుల దగ్గర జాతకాన్ని చూపిస్తూ ఉంటారు . ఇది చాలామంది ఇళ్లలో జరుగుతూ ఉండే విషయమే . అయితే ఇప్పుడు కూసింత టెక్నాలజీ మారిపోయిన కారణంగా జాతకాలు నమ్మడంలో జనాలు వెనకడుగు వేస్తున్నారు. అయితే న్యూమరాలజీని ఎక్కువగా నమ్ముతూ వస్తున్నారు.
 

మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ కూడా న్యూమరాలజీ ని నమ్ముతూ పేర్లలో మార్పులు చేయించుకుంటున్నారు . చాలామంది స్టార్ హీరోస్ అలా పేర్లు చేంజ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . కాగా రీసెంట్గా అల్లు అర్జున్ కూడా అలాగే చేయబోతున్నాడు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . మనకు తెలిసిందే అల్లు అర్జున్ గత కొన్ని రోజుల నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కొని ఉన్నాడో.  అసలు అల్లు అర్జున్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటాడు అని ఎవరు గెస్ చేయలేకపోయారు.



ఎవరు ఊహించలేకపోయారు . అల్లు అర్జున్ టైం బాగోలేకపోతే మరికొద్ది రోజుల్లోనే జైలుకు కూడా వెళ్లవలసిన పరిస్థితి వస్తుంది అంటూ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు . అయితే అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లినా సరే ఆఆ అంటూ తన పేరులోని మొదటి రెండు అక్షరాలను హైలెట్ చేస్తూ ఉంటారు.  నిజానికి ఆ రెండే ఇప్పుడు అల్లు అర్జున్ పేరిట శాపంగా మారిందట . న్యూమరాలజీ ప్రకారం అల్లు అర్జున్ పేరులో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట . అల్లు లో ఎక్స్ట్రా 'U' అదేవిధంగా అర్జున్ లో ఎక్స్ట్రా 'N' యాడ్ చేసుకుంటే (Alluu Arjunn)  కానీ అల్లు అర్జున్ కెరియర్ సెటిల్ అయ్యే విధంగా మారదట . న్యూమరాలజీ ప్రకారం అల్లు అర్జున్ ఇలా చేంజ్ చేసుకోవాలట.  అప్పుడే అల్లు అర్జున్ మళ్ళీ తన పేరుకి పునర్ వైభవం అందుకుంటాడట . దీంతో ఈ న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: