- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ మూవీ ఎలా ఉండబోతుంది ? ఎప్పుడు మొదలుపెడతారు ? వార్‌ 2 తర్వాత ఇమీడియట్ గా ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఇదేనా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు మైథెలాజికల్ సబ్జెక్టు తో ఎన్టీఆర్ నీల్ సినిమా ఉంటుందా ? లేదా ఇంకేదైనా వేరే బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నారా ? ఇలాంటి అన్నిటిపై క్లారిటీ వచ్చేది ఎప్పుడు . ఎన్టీఆర్ దేవర హిట్ తర్వాత అయ‌న‌లో జోష్ మామూలుగా లేదు .. రాజమౌళి తో సినిమా చేసిన తర్వాత కూడా హిట్ అందుకోవడమే ఈ జోష్ కు అసలైన కారణం .. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ ప్లానింగ్ మామూలుగా లేదు .


కొడితే కుంభస్థలాన్ని అన్నట్టుగా ఆయన వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు .. ప్రస్తుతం వార్ 2 పూర్తికాగానే ప్రశాంతి నీల్ సినిమా పై ఫోకస్ చేస్తున్నాడు ఎన్టీఆర్ .. ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశంత్ నీల్ సినిమాల పై చాలా రోజులుగా గాసిప్స్ వస్తూనే ఉన్నాయి . ప్రధానంగా ఇది మైథెలాజికల్ సబ్జెక్ట్ అని .. ఎన్టీఆర్ కోసం నీల్‌ కొత్తగా ఇందులో ట్రై చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది . వీటన్నిటి పై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు ..


ఇది మైథాలజి  కాదని .. పీరియాటిక్ యాక్షన్ సినిమా అని చెప్పుకొచ్చాడు . వార్ 2   తర్వాత ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కు వెళ్లనుంది .. కే జి ఎఫ్ , సలార్ కాన్సర్ తరహా లోనే ఇందులో కూడా కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు నీల్ .. అదే విధంగా యూరప్ లోని నల్ల సముద్రం దగ్గర ఎన్టీఆర్ 31 షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు . ఇందులో ఎన్టీఆర్ కు జంట గా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: