గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సినిమా టిక్కెట్ల విషయం పైన సినిమా ఇండస్ట్రీ పైన వెళ్లి మాట్లాడిన పెద్దలలో చిరంజీవి కూడా ఉన్నారు.. కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో భేటి అవుతున్న సినీ పెద్దల సమావేశానికి హాజరు కాకపోవడంతో ఒక రీజన్ ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే సీనియర్ హీరోలలో నాగార్జున ,వెంకటేష్ మాత్రమే తెలంగాణ సీఎంతో భేటీ కాబోతున్నారట. చిరంజీవి ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఈ భేటీకి దూరమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కొంతమంది యంగ్ హీరోలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నప్పటికీ సీనియర్ హీరోలలో కీలకమైన హీరోగా పేరు పొందిన చిరంజీవి హాజరు కాకపోవడంతో పాటుగా బాలయ్య కూడా హాజరు కాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా రాబోయే రోజుల్లో మరొక రోజు తెలంగాణ సీఎంలు కలుస్తారేమో చూడాలి మరి. మరి ఈ రోజున భేటీ అనంతరం అటు టాలీవుడ్ పరిశ్రమకు కాస్త ఊరట లభిస్తుందేమో చూడాలి ముఖ్యంగా సినిమా టికెట్ల విషయంలో స్పెషల్ షోల విషయంలో కాస్త అసంతృప్తితో సినీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. దిల్ రాజు సమక్షంలోనే ఈరోజు భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది.