ఈ సంవత్సరం సెప్టెంబర్ లో దేవర మొదటి భాగం కథ తెలుసుకున్నాం.. కానీ ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకుల‌లో అలాగే మిగిలిపోయాయి .. ప్రధానంగా దేవరను ఎవరు చంపారు ? ఎందుకు చంపారు ? అనే సమాధానం తెలియాలంటే దేవ‌ర‌ రెండో భాగం వచ్చేవరకు ఆగాల్సిందే .. 300 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని 500 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది .. ఇప్పుడు అందరి కన్ను దేవర2 పైనే ఉంది .  అయితే ఇప్పుడు సీక్వల్ గా రాబోతున్న దేవర2 రావటం కష్టమనే వార్తలు వస్తున్నాయి. అలాగే వార్ 2 తో పాటు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేయబోయే డ్రాగన్ తర్వాత దేవర పార్ట్ 2 లో నటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అదే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది. ఆ వార్త ఏంటి అనేది ఇక్కడ చూద్దాం.


దేవర తర్వాత వెంటనే వార్ 2 షూటింగ్లో దిగిపోయాడు ఎన్టీఆర్.. బ్రహ్మాస్త్రం తర్వాత ఆయన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.. రీసెంట్ గానే అమెరికాలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ చెయ్య‌గా.. వచ్చే సోమవారంతో ఈ షూటింగ్ను కంప్లీట్ చేయనున్నారు .. దీని తర్వాత డబ్బింగ్ తో పాటు ప్రమోషన్స్ వర్క్ అన్నిటికీ ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చేశాడు. ఇలా వార్ 2 షూటింగ్ పూర్తి అయిన వెంటనే .. ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న డ్రాగన్ మూవీ మొదలకానుంది .. ఇప్పటికే ప్రశాంత్ డ్రాగన్ స్క్రిప్ట్ ను పూర్తిచేసినట్టు తెలుస్తుంది .. ప్రస్తుతం ఎన్టీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్నారు.. అలాగే డ్రాగన్ మూవీని వీలైనంత స్పీడ్ గా కంప్లీట్ చేసి 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.


ఇక డ్రాగాన్‌ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా దేవర 2 బ‌అని అంత‌ అనుకున్నారు కానీ .. దేవర 2కు మరింత సమయం పట్టేలా ఉందని తెలుస్తుంది .. ఎన్టీఆర్ కోసం ఓ తమిళ దర్శకుడు భారీ స్క్రిప్ట్ ని రెడీగా పెట్టుకుని ఎదురుచూస్తున్నారట .. ఇంత‌కు అతను మరెవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్‌ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్.. ఎన్టీఆర్ కోసం నెల్సన్ ఇప్పటికే ఓ స్ట్రాంగ్ కథను రెడీ చేశారట .. అలాగే ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది .. ఇప్పటికే నెల్సన్ కు ఎన్టీఆర్కు నాగ‌ వంశీ అడ్వాన్స్ కూడా ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ .. 2026 లో ఈ సినిమాను స్టేట్స్ పైకి తీసుకువెళ్లడానికి   ప్లాన్ చేస్తున్నారట.


ఇలా 2026 మొత్తం నెల్సన్ కి డేట్స్ ఇవ్వబోతున్నారట ఎన్టీఆర్ .. ఆ సినిమాలో ఎన్టీఆర్ షూటింగ్ పూర్తయిన తర్వాతే ఆయన వేరే వర్క్ మొదలు పెడతారని తెలుస్తుంది .. అంటే 2026 చివరిలో ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ మొదలు కాబోతుంది .. అలా అన్నీ కుదిరితే ఆ 2026 చివరలో దేవ‌ర‌2 షూటింగ్ మొదలై అవకాశం ఉంది. దేవర ప్రేక్షకులు ముందుకు వచ్చి రెండు నెలలు గడుస్తుంది.. ఇప్పటివరకు కొరటాల నెక్స్ట్ సినిమా ఏంటి అనేది క్లారిటీ ఇవ్వలేదు .. దేవర 550 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చిన కొరటాలతో సినిమా చేయడానికి ఎవరు ముందుకు రావడంలేదని కూడా టాలీవుడ్ లో టాక్ .. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల ఓ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడట.. ఆ కథను మలయాల నటుడు మోహన్లాల్ కొడుకు ప్రణవ్‌ మోహన్‌లాల్‌‌ సినిమా చేయబోతున్నాడు అని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: