చిత్ర పరిశ్రమ లో నటీనటులు గా గుర్తింపు రావాలంటే ఎంతో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది .. అలాగే ఆ హీరోయిన్లకు వచ్చిన స్టార్‌డ‌మ్ కాపాడుకోవడం కూడా ఎంతో కష్టం .. వరుసగా విజయాలు అందుకుంటూ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న హీరోయిన్ల కెరియర్ లో కొన్ని ప్లాప్ సినిమాలు సైతం అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి .. అలాంటి సమయంలో కొందరు స్టార్స్ చేసే చిన్న చిన్న తప్పులు కారణంగా సినిమాలకు పూర్తిగా దూరమవుతూ ఉంటారు .. కానీ కొందరు వరుసగా ప్లాప్‌లు ఖాతాలో వేసుకున్న అప్పటికీ ఇండస్ట్రీలో వారి డిమాండ్ మాత్రం అసలు తగ్గదు ..


అలాంటి హీరోయిన్స్ లో ఒకరు .. వరుసగా 9 సినిమాలు ప్లాప్‌ అయినా కూడా ఆమెకు 900 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో బిగ్గెస్ట్ ఆపర్‌ వచ్చింది .. కానీ ఆ అవకాశం రిజెక్ట్ చేసింది .. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరు అంటే .. హీరోయిన్ మరెవరు కాదు బాలీవుడ్ స్టార్ బ్యూటీ పరిణితి చోప్రా .వరుస వైఫల్యాలను ఎదుర్కొన్నప్పటికీ ఆమె టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది .. చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో క్రేజ్ ను కొనసాగిస్తుంది .. 2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ మూవీతో వెండి తెరకు పరిచయమైంది.. మొద‌టి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు అందుకుంది.. ఆ తర్వాత షాక్‌జాదే (2012), శుద్ధ్ దేశీ రొమాన్స్ (2013),హసీ తో ఫాసీ (2014) వంటి హిట్‌ చిత్రాల్లో నటించింది.


కానీ ఆ తర్వాత ఆమె కెరీర్ లో దావత్-ఎ-ఇష్క్ (2014), కిల్ దిల్ (2014), మేరీ ప్యారీ బిందు (2017), నమస్తే ఇంగ్లాండ్ (2018) సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి.ఇక చాలాకాలం వరుస‌ ప్లాప్ సినిమాలో నటించిన పరిణితి .. ఈ ఏడాది సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది .. ఈ   సింగర్ దిల్జిత్ దోసాంజ్ క‌లిసి నటించిన చమ్కిలా మూవీ సూపర్ హిట్ అయింది .. అందులో పరణితి నటునకు మంచి మార్కులు పడ్డాయి .. గత ఏడాది సెప్టెంబర్ 24న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను వివాహం చేసుకుంది .. ప్రస్తుతం వరుస సినిమాలు రాజకీయాల్లో బిజీగా కొనసాగుతుంది .





మరింత సమాచారం తెలుసుకోండి: