తెలుగులో ఈ చిన్నది చేసింది రెండు మూడు సినిమాలే అయినప్పటికీ ఆ సినిమాలేవి పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో కృతి బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. హిందీలో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ అగ్ర హీరోయిన్ గా రాణిస్తోంది. ఈ బ్యూటీ తన కెరియర్ ప్రారంభించిన మొదటి నుంచి భారీగానే ఆస్తులను సంపాదించుకుంది. సినిమాల ద్వారా కాకుండానే వ్యాపార ప్రకటనలు, బిజినెస్ లు కూడా కృతి సనన్ చేస్తోంది.
కృతి సనన్ మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని, అతని భార్య సాక్షికి సన్నిహితుడు అయిన బిజినెస్ మెన్ కబీర్ బహియాతో డేటింగ్ చేస్తుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఈ జంట విదేశాలలో షికార్లు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో ఈ జంట డేటింగ్ పై అనేక రకాల పుకార్లు వస్తున్నాయి. కృతి సనన్ కన్నా కబీర్ 9 ఏళ్లు చిన్నవాడు అయినప్పటికీ ఈ బ్యూటీతో ప్రేమలో పడ్డాడు అంటూ అనేక రకాల చర్చలు జరిగాయి.
ఇదిలా ఉండగా.... 2024 డిసెంబర్ 25 క్రిస్మస్ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది కృతి సనన్. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ ఫోటోలలో కృతి, కబీర్ జంటగా కనిపించారు. ఈ ఫోటోలు చూసిన తర్వాత కృతి పరోక్షంగా కబీర్ తో తనకు ఉన్న రిలేషన్ ను అధికారికంగా అనౌన్స్ చేసిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ జంట ఎప్పుడు వివాహం చేసుకుంటారో చూడాలి.