అయితే ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ కెరియర్ లోనే నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది . దానికి కారణం కూడా ప్రభాసే . మనకు తెలిసిందే ప్రభాస్ పెద్దమ్మ 2024లో ప్రభాస్ పెళ్లి జరగబోతుంది అంటూ చాలా ధీమాగా చెప్పింది . స్టేట్మెంట్ కూడా పాస్ చేసింది . అయితే ప్రభాస్ ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకుంటాడు అంటూ చాలా ఆశపడ్డారు ఫ్యాన్స్. ఇదిగో మార్చిలో గుడ్ న్యూస్ చెప్తాడు .. ఆగస్టులో గుడ్ న్యూస్ చెప్తాడు .. సెప్టెంబర్ లో పెళ్లి వార్త చెప్తాడు ..అక్టోబర్ లో నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు . నవంబర్లో పెళ్లి అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాడు .
ఇలా రకరకాల వార్తల వైరల్ అయ్యాయి. సీన్ కట్ చేస్తే మరో నాలుగు రోజుల్లో ఇయర్ ఎండ్ కావస్తుంది . అయినా సరే ప్రభాస్ తన పెళ్లి గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. పెళ్లి విషయం పక్కన పెడితే నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ కూడా ఏ మాట బయటకు పెట్టలేదు . దీంతో కొంతమంది ఫాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు. మరి కొంతమంది జనాలు మాత్రం ప్రభాస్ ఈ జన్మలో పెళ్లి చేసుకోడు ఇదంతా సినిమా పబ్లిసిటీ కోసమే అంటూ కూసింత ఘాటుగా ట్రోల్ చేస్తూ నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. పాపం ప్రభాస్ పెళ్లి ఆయన పై నెగిటివ్ ట్రోలింగ్ జరిగేలా చేస్తుంది..!