పై ఫోటోలో కనిపిస్తున్న  టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ .. తెలుగు అమ్మాయి కూడా.. బుల్లితెరపై నటిగా కెరియర్ మొదలుపెట్టిన అందాల తార ఆ తర్వాత వెండితెరకు పరిచయమైంది .. అలాగే కొన్ని సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించింది .. తన అందం అభినయంతో మంచి మార్కులే తెచ్చుకుంది. కెరియర్ మొదటిలో విజయాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత సరైన సినిమాలు చెయ్యక వరుస ప్లాప్‌లు అందుకుంది .. ఇక దాంతో చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోయింది .. అదే క్రమంలో లాయర్ కోర్సు కూడా కంప్లీట్ చేసుకుంది .. ఇప్పుడు ఏకంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో లాయర్ గా వీధులు నిర్వహిస్తుంది.


ఇంతకు ఈ లేడీ వకీల్ సాబ్ ఎవరు అనేది ఇక్కడ చూద్దాం. ఈ రోజుల్లో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన రేష్మ రాథోడ్ .. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఈమె వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో చదువుని కంప్లీట్ చేసింది .. అదే సమయంలో 2012లో వెంకటేష్ , త్రిష జంటగా వచ్చిన బాడీగార్డ్ సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ గా కూడా నటించి అదరగొట్టింది. అదే సంవత్సరం మారుతీ డైరెక్షన్లో  ఈ రోజుల్లో  యూత్ ఫుల్ మూవీ లో హీరోయిన్గా నటించి రేష్మ తన అందం అభినయంతో మంచి మార్కులు తెచ్చుకుంది .. హీరోయిన్గా మొదటి సినిమాతోనే సూపర్ విజయ్ అందుకున్న రేష్మ..


దివంగత ఉదయ్ కిర‌ణ్ తో క‌లిసి జైశ్రీరామ్ అనే సినిమాలో కూడా నటించింది .. ఆ సినిమా పెద్దగా ఆడకపోవటంతో.. ఆ తర్వాత లవ్ సైకిల్, ప్రతిఘటన జీలకర్ర బెల్లం, ప‌లు మలయాళం, తమిళ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది .. తర్వాత 2017లో నటనకు గుడ్ బాయ్ చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలు కి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లిపోయింది రేష్మ.. ప్రస్తుతం బిజెపి పార్టీలో కొనసాగుతుంది.. ఇదే క్రమంలో లాయర్ కోర్సు కూడా పూర్తి చేసింది .. హీరోయిన్గా పెద్ద క్రేజ్ రానప్పటికీ లాయర్ గా రేష్మ తనదైన మార్క్ సుప్రీంకోర్టులో చూపిస్తుంది .. ఈ సంవత్సరం జూలైలో సుప్రీంకోర్టు లాయర్ గా ఆమెకు పదోన్నతి వచ్చింది .. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా అదరగొడుతుంది ఈ లేడీ వకీల్ సాబ్..



మరింత సమాచారం తెలుసుకోండి: