ఈ విధంగా జానీ మాస్టర్ కు తీవ్రస్థాయిలో అన్యాయం అయితే జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్ రెమ్యునరేషన్ కూడా గతంతో పోలిస్తే తగ్గిందని భోగట్టా. స్టార్ హీరోలు చొరవ చూపితే మాత్రమే జానీ మాస్టర్ కు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. జానీ మాస్టర్ కు జరుగుతున్న అన్యాయం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జానీ మాస్టర్ కొరియోగ్రఫీకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని నిర్దోషిగా జైలు నుంచి విడుదలవుతానని జానీ మాస్టర్ చెబుతున్నారు. జానీ మాస్టర్ ఇమేజ్ కు మాత్రం ఈ వివాదాల వల్ల ఊహించని స్థాయిలో డ్యామేజ్ జరుగుతోందనే చర్చ సైతం జరుగుతోంది. జానీ మాస్టర్ కెరీర్ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తే జానీ మాస్టర్ కెరీర్ సులువుగానే పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. జానీ మాస్టర్ రాబోయే రోజుల్లో కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తే ఆయన ఖాతాలో మరిన్ని విజయాలు చేరే అవకాశాలు ఉన్నాయి. జానీ మాస్టర్ నిర్దోషిగా విడుదలైన తర్వాతైనా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు దక్కుతాయేమో చూడాలి. జానీ మాస్టర్ మాత్రం ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. కొంతమంది తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నా మాస్టర్ మాత్రం పట్టించుకోవడం లేదు.