ఇప్పుడు పరిస్థితి ఎలా తయారయిందో మనం చూస్తున్నాము. తెలంగాణ సీఎం వర్సెస్  టాలీవుడ్ ఇండస్ట్రీ అన్న రేంజ్ లో వార్ జరుగుతుంది. అయితే కేవలం అల్లు అర్జున్ ఇష్యూ కారణంగానే ఇది జరుగుతుందా ..? అంటే నో అని చెప్పాలి . అల్లు అర్జున్ కన్నా ముందే సినిమా ఇండస్ట్రీని టచ్ చేసి రేవంత్ రెడ్డి గజగజ వణికించాడు . అయితే కొన్ని కొన్ని సందర్భాలలో సినిమా ఇండస్ట్రీకి ఫేవర్  కూడా చేశారు . మరి ముఖ్యంగా పుష్ప సినిమాకు బెనిఫిట్ షోలు వేసుకోమంటూ పర్మిషన్ ఇవ్వడం .. అదేవిధంగా టికెట్ రేట్లు పెంచి పుష్ప2  కలెక్షన్స్ కు సపోర్ట్ చేయడం అందరికీ తెలిసిందే .


అయితే ఊహించిన విధంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరగడం .. అక్కడ రేవతి అనే మహిళ మృతి చెందడం ..ఆ కేసు అర్జున్ పైకి వెళ్లడం .. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం బెయిల్ పైకి రావడం.. అంతా చూస్తూనే ఉన్నాం . కాగా రేవంత్ రెడ్డి ఇకపై బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వను అని టికెట్ రేట్లు పెంచను అంటూ తేల్చి చెప్పేసాడు.  దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అయింది . దీంతో రేవంత్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది టాలీవుడ్. అయితే రేవంత్ రెడ్డి మాత్రం అస్సలు తగ్గేదేలే అన్న రేంజ్ లో ముందుకు వెళ్తున్నాడు . సినీ ప్రముఖులు చాలాసార్లు అపాయింట్మెంట్ కోరిన ఇవ్వనే ఇవ్వలేదు .



అయితే ఎట్ లాస్ట్ నేడు ఇండస్ట్రీ ప్రముఖులతో మాట్లాడడానికి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చాడు. అయితే రేవంత్ రెడ్డి ఇంట్లో కాకుండా వేరే పోలీసు శాఖ భవనంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో రేవంత్ రెడ్డి చాలా కోపంగా ఉన్నాడు అన్న విషయం ఈజీగా అర్థమవుతుంది. అయితే మెగాస్టార్ అండ్ టీం ఎలా రేవంత్ రెడ్డిని ఒప్పిస్తారు..? అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. అయితే రేవంత్ రెడ్డితో మీటింగ్ కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి స్టార్ ప్రముఖులను సెలెక్ట్ చేసుకున్నారు సినిమా మండలి. అయితే అందులో ఓ పెద్ద బడా స్టార్ మాత్రం రేవంత్ రెడ్డి తో మీటింగ్ కి  రానే రాను అని తేల్చి చెప్పేసాడు . అసలు రేవంత్ రెడ్డి తో మాట్లాడే అవసరం నాకు లేదు అని కోపంగా చెప్పేసాడట . గతంలో రేవంత్ రెడ్డిహీరో పై తీసుకున్న కొన్ని యాక్షన్స్ అందుకు కారణమంటూ జనాలు భావిస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్  వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: