టాలీవుడ్‌ పెద్దలకు బిగ్‌ షాక్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండబోవని తేల్చి చెప్పారు సీఎం రేవంత్‌ రెడ్డి. సినీ ప్రముఖుల సమావేశంలో తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండబోవని తేల్చి చెప్పిన సీఎం రేవంత్... ఈ మేరకు కుండ బద్దలు కొట్టారట. రేవతి ఇష్యూ జరిగిన తరుణంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించేశారు రేవంత్‌ రెడ్డి. ఇవాళ టాలీవుడ్ పెద్దలతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌ మాట్లాడారు.


అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్న రేవంత్‌ రెడ్డి... బెనిఫిట్ షోలు ఉండబోవని పేర్కొన్నారు. - శాంతిభద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్‌ రెడ్డి.... ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని వార్నింగ్‌ ఇచ్చారు.  అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అంటూ తేల్చి చెప్పారట. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి.. రాయితీలు ఇస్తామన్నారు.


తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలని కోరారు సీఎం రేవంత్‌ రెడ్డి. డ్రగ్స్‌ క్యాంపెయిన్‌, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలని ఆదేశాలు ఇచ్చారు. టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని స్పష్టం చేశారు రేవంత్‌ రెడ్డి.  ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని తేల్చి చెప్పారు సీఎం రేవంత్‌ రెడ్డి.

టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి.. బెనిఫిట్ షోల విషయం మరిచిపోవాలని కోరారట.  సంధ్య థియేటర్‌ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారట.  ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే..తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారట.  టాలీవుడ్‌కు మేం వ్యకిరేఖం కాదని వివరణ ఇచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి. టాలీవుడ్‌ సమస్యల పరిష్కారానికి మేం ముందుంటామని భరోసా కల్పించారు.  ఎవరూ ఆందోళన చెందకూడదని కూడా కోరారట సీఎం రేవంత్‌ రెడ్డి.




 

మరింత సమాచారం తెలుసుకోండి: