ఇక పోతే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అందరికి తెలిసిందే. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. తొక్కిసలాటలో శ్రీ తేజ్ కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని.. ఆసుపత్రి ICU లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆ బాలుడి ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నాడు.
ఇక ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనదుకు థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది. దీంతో ఈ ఎలాంటి ఘటన మళ్లీ ఎప్పుడు జరగకూడదని ఇలాంటి కండిషన్స్ సర్కార్ పెడుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.