2013 మిస్ ఇండియా పోటీల్లో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొని రెండవ స్థానంలో విజేతగా నిలిచింది. ఇక శోభిత కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించింది. ఎంతో అద్భుతంగా నటించే టాలెంట్ ఉన్నప్పటికీ శోభితకు అతి తక్కువ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కానీ ఈ బ్యూటీ ఏకంగా అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకోవడంతో ఇప్పుడు కోట్లాది సంఖ్యలో అభిమానులు పెరిగారు.
దానికి తగినట్టుగానే శోభిత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోషూట్లు చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటుంది. చాలా కాలం పాటు నాగచైతన్యతో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ 2024 డిసెంబర్ 5వ తేదీన వివాహం చేసుకుంది. వివాహం తర్వాత అక్కినేని కుటుంబంలో చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది. రీసెంట్ గా అక్కినేని నాగార్జున తన కోడలు చాలా మంచి మనసున్న అమ్మాయి అని తన రాకతో మా ఇంట్లో సంతోషాలు వెదజిల్లుతున్నాయంటూ చెప్పాడు.
ఇక శోభిత వివాహం తర్వాత సినిమాలలో నటిస్తుందా లేకపోతే తన భర్త నాగచైతన్య ఇష్టం మేరకు సినిమాలు మానేస్తుందా అనేది చూడాలి. కాగా, అక్కినేని నాగచైతన్య వివాహం జరిగిన అతి తక్కువ సమయంలోనే తన భార్య శోభిత పేరు మీద ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫ్లాట్ ఎక్కడ కొనుగోలు చేశాడు అనే విషయాలు తెలియాల్సి ఉంది.