గుంటూరు కారం సినిమా తర్వాత సోషల్ మీడియాలో చాలా దారుణ అతి దారుణంగా ట్రోలింగ్కి కూడా అయ్యారు త్రివిక్రమ్ శ్రీనివాసరావు. ఒకానొక టైం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ కూడా టాక్ వినిపించింది . అయితే ఆ తర్వాత అల్లు అర్జున్తో సినిమాకి కమిట్ అయ్యాడు . త్వరలోనే అల్లు అర్జున్ తో కమిట్ అయిన సినిమా సెట్స్ పైకి రావాలి. కానీ పుష్ప2 ఇష్యూ కారణంగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం .. ఆ తర్వాత ఆ పనుల్లో బిజీబిజీగా ఉండడం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కి కూడా నెగిటివ్గా మారిపోయింది .
అయితే రీసెంట్ గా సినిమా సభ్యలు సీఎం రేవంత్ రెడ్డి ను కలిశారు. తెలంగాణలో బెనిఫిట్ షోలకి పర్మీషన్ ఇవ్వండి అని.. అదే విధంగా టికెట్ రేట్ పెంచి సినిమా ఇండస్ట్రీకి సహకరించండి అనే విధంగా రిక్వెస్ట్ చేయడానికి పలువురు సినీ సభ్యులు రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ఈ మీటింగ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కూడా పాల్గొన్నారు . రేవంత్ రెడ్డితో జరిగిన మీటింగ్లో అసలు నోరు కూడా ఎత్తలేదు అన్న టాక్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది . ఎక్కడ ఏం మాట్లాడితే ఏ విధంగా కేసు పెడతారో..? అల్లు అర్జున్ ని టార్గెట్ చేసినట్లే తనని కూడా టార్గెట్ చేసి ఊహించని చిక్కులు ఎదుర్కొనేలా చేస్తారో..? అన్న భయంతోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సైలెంట్ గా ఉండిపోయారు అంటూ కూడా టాక్ వినిపిస్తుంది . అంతేకాదు రేవంత్ రెడ్డి సినిమా స్టార్స్ కి చుక్కలు చూపించారట. మీటింగ్ లో ఎవ్వరు కూడా తడబడకుండా చాలా జాగ్రత్తగా రేవంత్ రెడ్డికి రెస్పెక్ట్ ఇస్తూనే మాట్లాడారు అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ పరిపాలన కొనసాగిస్తున్నాడేమో అన్న డౌట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు జనాలు..!