తెలుగు సీనియర్ నటుడు మోహన్ బాబు తనదైన నటనతో వెండితెరపై సినీ ప్రేక్షకులను అభిమానులను అలరించారు .. ఆయన కెరియర్ లో నటుడుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా ఇలా ఎన్నో సినిమాల్లో నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలు అందుకున్నారు .. అలాగే ఈ రీసెంట్ టైమ్స్ లో తన కెరీర్ లో హిట్ అయిన సూపర్ హిట్ సినిమాల గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు .. అందులో తన సినిమాలో డైలాగ్స్ సీన్స్ ని గుర్తు చేసుకుంటున్నారు .. తాజాగా మరో సినిమాకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


1991లో మోహన్ బాబు హీరోగా వచ్చిన అసెంబ్లీ రౌడీ .. ఈ సినిమా ఆరోజుల్లో బాక్సాఫీస్ కు దడ పుట్టించింది .. ఒక థియేటర్లో 200 రోజులు ఆడి కలెక్షన్ కింగ్ అనే బిరుదును మోహన్ బాబుకు అందించింది .. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రికార్డులు సృష్టించిన అసెంబ్లీ రౌడీ సినిమాకు యాక్షన్ దర్శకుడు బి . గోపాల్ దర్శకత్వం వహించారు .. పి . వాసు , పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు కథను అందించారు .. కేవీ మహదేవన్ సంగీత అందించిన ఈ సినిమాని తాజాగా మోహన బాబు మరోసారి గుర్తుచేసుకున్నారు .. ఈ సినిమా ఆయన కెరియర్ లోనే ఓ గొప్ప మైలురాయిగా నిలిచిపోయిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.


ఇదే స‌య‌మంలో మోహన్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ .. అసెంబ్లీ రౌడీ తన సినీ ప్రయాణంలో ఓ గొప్ప మైలురాయి .. బి . గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ కామెడీ సినిమాలో హీరో పాత్రను నేను పోషించాను .. ప్రేక్ష‌కులను మెప్పించే కథ‌ అంశంతో పి . వాసు , పరుచూరి బ్రదర్స్ అందించిన డైలాగ్స్ ఈ సినిమాకు నా కెరియర్ లో ఎంతో ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్నాయి .. థియేటర్లో 200 రోజులు ఆడి రికార్డులు మోతా మోగించింది .. అలాగే కలెక్షన్ కింగ్ అనే బిరుదును నాకు అందించిన సినిమా కూడా ఇదే .. ఈ సినిమాలో కె.వి.మహదేవన్ మ్యూజికల్ హిట్టు నేటికీ ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉన్నాయని ఆయన పోస్ట్ చేశారు .. మోహన్ బాబు కెరియర్లు అసెంబ్లీ రౌడీ సినిమా ఓ గొప్ప మైలురాయిగా నిలిచిపోయింది. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాల కారణంగా మోహన్ బాబు  కు సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: