యాంకర్ విష్ణు ప్రియ గురించి తెలుగు కుర్రకారుకి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఓ రకంగా ఆమె యాంకర్ గా కంటే కూడా ప్రయివేట్ సాంగ్స్ తోనే ఎక్కువ పాపులర్ సంపాదించింది. మరీ ముఖ్యంగా "జరీ జరీ చీరే కట్టి" అనే పాటతో ఆమె చాలా పేరు సంపాదించింది. ఆ పాటలో విష్ణు ప్రియ అందాలవిందుతో కుర్రకారుకి కనులవిందు చేసింది. ఆ తరువాత క్రమంలో ఆమె బిగ్ బాస్‌కి కూడా వెళ్లడంతో అందరికీ పరిచయం అయ్యింది. అయితే బిగ్ బాస్‌ హౌస్ లోకి వెళ్ళాక మంచి పేరుతో తిరిగి వచ్చేవారి కంటే, చెడ్డ పేరుతో బయటకి వచ్చేవారే ఎక్కువ. ఈ క్రమంలో ఉన్న ఇమేజ్‌ కూడా డ్యామేజ్ చేసుకున్న జనాలు ఉన్నారు. దానికి ప్రధాన ఉదాహరణగా షణ్ముఖ్ జశ్వంత్ ని చెప్పుకోవచ్చు.

అయితే ఇపుడు ఈ తంతంతా ఎందుకంటారా? అదిగో అక్కడికే వస్తున్నా... షణ్ముఖ్ అంత కాదుగానీ, డ్యామేజింగ్ కంటెస్టెంట్‌ల వరుసలో మాత్రం నిలిచింది విష్ణు ప్రియ. మొదట నంగనాచిలాగా ఛీ ఛీ బిగ్ బాసా? ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్ బాస్‌లోకి వెళ్లను... రాసిపెట్టుకోండి! బయట ఇంత అందమైన ప్రపంచం ఉంటే.. దాన్ని వదిలి ఆ బిగ్ బాస్‌లోకి ఎందుకు వెళ్తాను? అంటూ గప్పాలు కొట్టి, చాన్సు రాగానే విష్ణు ప్రియ ఎగేసుకుంటూ సీజన్ 8 కంటెస్టెంట్‌గా వెళ్లి ఉన్న పేరుని కూడా చెడగొట్టుకుంది. ముఖ్యంగా పృథ్వీ విషయంలో.. అమర ప్రేమికురాలిగా మారి, ఆటని అటకెక్కించి, ధ్యాసంతా పృథ్వీపై పెడుతూ... అందరితో ఛీ అనిపించుకుంది.

ఈ క్రమంలో ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పి చూసినా కూడా.. నాకు అతనే కావాలని నిస్సిగ్గుగా తేల్చి చెప్పడమే కాకుండా అతనితో హద్దులు దాటి ముద్దులు హగ్‌లతో బిగ్ బాస్ హౌస్ ని రొమాంటిక్ హౌస్ గా మార్చివేసింది. ఆమె తీరని చూసినవాళ్లు వామ్మో! ఇంత కరువులో ఉందేంట్రా బాబూ? అని ముక్కున వేలేసుకునేట్టుగా ఆమె ప్రవర్తించింది. అయితే వాస్తవానికి విష్ణు ప్రియ.. ఆ ఒక్క విషయంలో తప్ప ఇంకే విషయంలో కూడా బ్యాడ్ అవలేదు. ఈ క్రమంలోనే కనీసం టాప్ 5కి కూడా చేరకుండా చివరి వారంలో ఎలిమినేట్ అయ్యి నిష్క్రమించింది. ఇక బిగ్ బాస్ ముగిసిపోయిన తరువాత ఆమె ఎట్టకేలకు తన బిగ్ బాస్ జర్నీపై కీలక విషయాలను తాజాగా ఓ మీడియా వేదిక ద్వారా తెలియజేసింది విష్ణు ప్రియ. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ... అవును.. బిగ్ బాస్ హౌసులో నేను కంట్రోల్ తప్పాను. నేను చాలాసార్లు చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. నాకు కోపం ఎక్కువ.. ఇగో ఎక్కువ.. వాటిని నేను ఎంత వరకూ కంట్రోల్ చేసుకోగలుగుతున్నానో తెలుసుకోవాలనిపించింది. నేను లోపల ఉన్నప్పుడు.. నా గురించి చేస్తున్న కామెంట్స్ విని.. వీళ్లకి నా పర్సనాలిటీ గురించి తెలియడం లేదా? అని బాధపడేదాన్ని. ఎవరు ఏమనుకున్నా నాకు నచ్చినట్టే చేశాను. కొన్నిసందర్భాల్లో నేను కంట్రోల్ తప్పాను. ఎమోషనల్‌గా నేను వీక్ కావడం వల్ల అలా జరిగింది! అంటూ అసలు విషయం చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: