తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం గడిచింది. ఇదే తరుణంలో వారు 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేస్తామని కాస్త విఫలం అయిపోయారు.  దీనికి తోడు ప్రజల్లో కాంగ్రెస్ పై కాస్త వ్యతిరేకత పెరగడమే కాకుండా ఈ మధ్యకాలంలో గురుకులాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోవడం కూడా పెద్ద ఇష్యూగా మారింది. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, 6 పూర్తిస్థాయిలో చేయకపోవడం పింఛన్ల పెంపు ఇదే క్రమంలో లాగా చర్ల ఫార్మా కంపెనీ ఘటన ఇలా అనేక వ్యతిరేక కోణాలు ప్రభుత్వంపై రావడంతో ప్రజలు ప్రభుత్వాన్ని తిడతారని ఆలోచనతో ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన చేసింది. ఈ వ్యతిరేకత నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే అల్లు అర్జున్ ని పావుగా వాడుకుంది. 

 ముఖ్యంగా పుష్ప2 సినిమా రిలీజ్ అయిన రోజు సంధ్య థియేటర్ వద్ద   తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో  ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీ ఒకవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు అనే విధంగా తయారయింది.. దీంతో ఇండస్ట్రీలోని పెద్దలంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సయోధ్య చేసే ప్రయత్నం చేశారు. కానీ సీఎం బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకోవడం అసలు కుదరదని ఖరాకండిగా చెప్పేశారు.

 ఈ విధంగా ఇండస్ట్రీలో ఈ విషయం అంతగా పట్టించుకునేది కాకపోయినా రేవంత్ రెడ్డి మాత్రం దీన్ని కాస్త హైలెట్ చేసి సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఇదే ప్రధానమైన సమస్యగా మరేలా చేశారని చెప్పవచ్చు.  దీన్నిబట్టి చూస్తే మాత్రం ప్రభుత్వం పై ప్రజలు చాలా గురువుగా ఉన్నారు కాబట్టి ఆ ఇష్యూ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే  ఈ విధంగా రేవంత్ సర్కార్ సరికొత్త ప్లాన్ గీసిందని ఇందులో అల్లు అర్జున్ ను పావుగా వాడుకుందని   కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: