సంక్రాంతికి బాలయ్య బాబు సినిమా అంటే మామూలుగా ఉండదు .. అది పక్క హిట్ అనే సెంటిమెంట్ ఎప్పుడూ ఉంటుంది .. ఈ సంక్రాంతి కూడా జనవరి 12న సంక్రాంతి వార్‌లో బాలయ్య సినిమా ఉంది.. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు బాబి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు . బాలయ్యతో సినిమా చేసిన ఏ దర్శకుడైన ఆయన్ని దర్శకుల హీరో అని అంటారు .. బడా హీరోలంతా కథ విన్న తర్వాత ఆ కథలో వేలు పెట్టి ఆనవాయితీ టాలీవుడ్ లో ఉంది .. అయితే బాలయ్య మాత్రం దర్శకుడికే ఎంతో ఫ్రీడమ్ ఇస్తారని .. ఆయన్ని ఆకాశానికి ఎత్తేసాడు దర్శకుడు బాబి. బాలయ్య బాబు ఒక దర్శకుని ఇంటి వరకు పిలిచారంటే.. ఆయనతో సినిమా చేద్దాం అనుకుంటేనే ఆయన పిలుస్తారు .. అలా పిలుపు వచ్చిన తర్వాత సినిమా చేయకపోవడం అనేది ఆయన డిక్షనరీలో ఉండదు .. స్టోరీ విన్న తర్వాత చూద్దాంలే చేద్దామని అసలు ఉండదు .. మనం కథ చెప్పిన తర్వాత ఆయన ఏవైనా డౌటులు ఉంటే .. ఆ నాలుగు గోడల మధ్య అడిగేస్తారు .. అన్ని సినిమాలు చేశారు కాబట్టి కచ్చితంగా డౌట్లు వస్తాయి .. రాగానే కథ చెప్పి వెళ్లిపోవడం వరకే కాదు ఆయన పలు దఫాలుగా కథ చెప్పిన తర్వాత ఒకసారి ఓకే అని చెప్పారంటే ఆ సినిమా అవ్వాల్సిందే.


ఆయనతో సినిమా చేసే దర్శకులకి ఎంతో ఫ్రీడమ్ ఉంటుంది .. కథ విన్న తర్వాత ఆయనకి అనిపించింది చెబుతారు.. అలాగే సినిమాకి సంబంధించిన ఏ నిర్ణయమైనా దర్శకుడు తీసుకోవాలని ఆయన అంటారు .. అలాగే దర్శకుని గుడ్డిగా నమ్మేస్తారు .. ఆయన దగ్గర ఆప్షన్లు పనిచేయవు దర్శకుల నిర్ణయమే .. దర్శకుల ఆయనకి ఆప్షన్లు ఇచ్చిన నాకెందుకు ఏం చేయాలో చెప్పమని అడుగుతారు .. వారు ఏం చెప్తే అది చేస్తారు .. దర్శకులు ఏమనుకుంటున్నారో దాన్ని తెరపై చూపించడమే ఆయనకు తెలిసిన పని. బాలకృష్ణ కెరీర్ లో సమరసింహారెడ్డి , నరసింహనాయుడు సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లు.. వాటిలో యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి .. ఇప్పుడు బాలకృష్ణ సంక్రాంతి కి వ‌స్తున్న డాకు మహారాజ్‌లో కూడా అలాంటి ఎమోషన్స్ ఉండబోతున్నాయి..


ప్రధానంగా సెకండ్ హాఫ్ లో బందిపోటు క్యారెక్టర్ ఎవరు ఊహించని లవ‌వ్ లో ఉంటుంది. అదేవిధంగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు పెట్టింది కూడా కథ డిమాండ్ చేయడం కారణంగానే. ప్రగ్యా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ , ఊర్వశి రౌతేలా ఈ ముగ్గురు హీరోయిన్లు సినిమా కథకి ఎంతో అవసరం. అలాగే పాన్ ఇండియా నటుడు బాబీ డియోల్ పాత్ర‌ ఈ సినిమాకి ఎంతో హైలెట్ కాబోతుంది. యానిమల్ తర్వాత ఆయన స్థాయి మరో రేంజ్కి వెళ్ళింది. ఆయన చేసే ప్రతి పాత్రను ఎంతో సెలెక్టివ్గా ఎంచుకుంటున్నారు .. ఎంత పెద్ద సినిమా అయినా ఆయన పాత్రికే ప్రాధాన్యత లేకపోతే చేయటం లేదు. అలాంటిది ఆయన ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పారు .. ఇక డాకు మహారాజ్ లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో మీరే అర్థం చేసుకోవచ్చు అంటూ దర్శకుడు బాబి చెప్పకొచ్చారు. సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్ బాలయ్య కెరియర్ లోనే ఊహించని సక్సెస్ అవుతుందని కూడా అంటున్నారు. ఇక మరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ఎలాంటి బాంబు పేలుస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: