ఇప్పటికే 2024 సంవత్సరం చివరి దశకు వచ్చింది .. అయితే ఈ సంవత్సరం జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టార్ హీరోల సినిమాలలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఒకటి.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా.. శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు .. దర్శకుడు త్రివిక్రమ్ సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది .. అందుకే మహేష్ బాబు , రమ్యకృష్ణ , ప్రకాష్ రాజ్ కాంబినేషన్లో బలమైన సన్నివేశాలను ప్రేక్షకులు ఊహించుకున్నారు .. కానీ వాళ్ళ ఊహకు దగ్గరగా సినిమా లేకపోవడంతో ప్లాప్ టాక్‌ తెచ్చుకుంది.


అలాగే ఈ సంవత్సరం జూన్‌లో ప్రభాస్ నటించిన కల్కి థియేటర్లో సందడి చేసింది .. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన సినిమాకు .. సంతోష్ నారాయణ్‌ సంగీతం అందించిన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది .. స్టోరీ పరంగా ప్రభాస్ అభిమానులను సైతం సంతృప్తిని కలిగించలేకపోయింది .. ప్రభాస్ లుక్ దగ్గర నుంచి ఆయన పాత్ర డిజైన్ చేయడం వరకు ఎన్నో కామెంట్లు వచ్చాయి .. అలాగే తమ ఆశించిన ఎంటర్టైన్మెంట్ లేదనే టాక్ కూడా థియేటర్ల వ‌ద్ద‌ వచ్చింది.


ఎన్టీఆర్ దేవర విషయంలోనూ ఇదే జరిగింది .. కొరటాల ఎంతో సవాల్గా భావించి తెర్కక్కించిన సినిమా ఇది .. భారీ బడ్జెట్ తో తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ .. జాన్వి కపూర్ తొలిసారిగా తెలుగులో ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు .. ఈ సినిమాకు భారీ కలెక్షన్లు కూడా వచ్చాయి .. అయితే కథపరంగా కొన్ని విమర్శలు తెచ్చుకుంది .. సన్నివేశాల్లో భారీ తనమే తప్ప సహజత్వంం లేదని .. లవ్ రొమాన్స్ ఎమోషన్స్ వైపు నుంచి కనెక్ట్ చేసుకోలేకపోయిందని ప్రేక్షకులు అన్నారు .. అలాగే ఈ సినిమాల‌కు సంబంధించిన ఆర్థికపరమైన విషయాలను పక్కనపెడితే తమ హీరోల నుంచి తమ ఆశించిన స్థాయి కంటెంట్ రాలేదని  అసంతృప్తి మాత్రం అభిమానుల్లో కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: