టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి అంటే తెలియని వారుండరు. నవీన్ పోలిశెట్టి హీరోగా తీసినవి కొన్ని సినిమాలు అయినప్పటికీ చాలా క్రాజ్ ని సంపాదించుకున్నాడు. ఈయన నటనకు చాలా మంది ఫాన్స్ ఉన్నారు. లేటెస్ట్ గా హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి ప్రేక్షకుల మనస్సును దోచుకున్నాడు. అయితే ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి హీరోగా సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో 'అనగనగా ఒకరాజు' సినిమాని తెరకెక్కిస్తున్నారు. కళ్యాణ్ శంకర్‌ దర్శకత్వంలో నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నవీన్ పోలిశెట్టి కి జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2025లో విడుదల చేయనున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ వెడ్డింగ్‌ వీడియో రిలీజ్ చేశారు. అందులో ప్రీ వెడ్డింగ్‌ వీడియో ప్రారంభంలో పెళ్లికి వచ్చిన అతిథులందరికీ బంగారు పళ్లెంలో భోజనం వడ్డిస్తున్నారు. మరోవైపు రాజుగారు నవీన్‌ పొలిశెట్టి.. అనంత్‌ అంబానీ పెళ్లి వీడియో చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ముకేశ్‌ అంబానీ ఫోన్‌ చేశాడట! ముకేశ్‌ మామయ్య... నీకు వంద రీచార్జులు.. ఇప్పుడే మన అనంత్‌ పెళ్లి క్యాసెట్‌ చూస్తున్నా.. అంటూ సంభాషణ మొదలుపెట్టాడు. చివర్లో పెళ్లికూతురు మీనాక్షి చౌదరితో ఫోటోషూట్‌ కూడా చేయించారు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ ప్రీ వెడ్డింగ్ సాంగ్ తోనే నిండిపోయింది. దీంతో ఈ ప్రీవెడ్డింగ్‌ వీడియో చూసిన ప్రేక్షకులు ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవడం గ్యారెంటీ అని అంటున్నారు. మూడు నిమిషాల వీడియోలోనే ఇంత ఫన్‌ ఉంటే ఫుల్‌ సినిమా ఇంకే రేంజ్‌లో ఉంటుందోనని ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు.
ఇకపోతే నవీన్ పొలిశెట్టి గత సంవత్సరం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనుష్క ఆ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అయితే అంతకు ముందు నవీన్ జాతిరత్నాలు మూవీతో బ్లాక్‌బస్టర్ దక్కించుకున్నాడు. ఇక నవీన్ కాస్త స్పీడ్‌గా ఉండాలి, త్వరగా సినిమాలు చేయాలి అంటూ ఆయన ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: