నటి కస్తూరి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తమిళ స్టార్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాలో కమలహాసన్ కు చెల్లెలి పాత్రలో నటించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అనంతరం కస్తూరి మంచి గుర్తింపు తెచ్చుకొని నటిగా ఎన్నో సినిమా అవకాశాలను అందుకుంది. నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించి అభిమానులను సంపాదించుకుంది.

 
కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న కస్తూరి ఆ తర్వాత సీరియల్స్, వెబ్ సిరీస్ లలో నటించి బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, మలయాళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పాటు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే నటి కస్తూరి తరచూ వివాదాలలో నిలుస్తూ ఉంటుంది. కొద్దిరోజుల క్రితం బిగ్ బాస్ పై వివాదాస్పద వాక్యాలు చేసి అనేక రకాల విమర్శలను ఎదుర్కొంది.


కస్తూరి తెలుగు వారిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో కస్తూరి అరెస్ట్ కూడా అయింది. ఇక తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు కస్తూరి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.... జైలులో జీవితం ఎలా ఉంటుందో వివరించింది. జైలు లోపలికి వెళ్లే సమయంలో సమగ్రంగా చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారని చెప్పింది. పుట్టినప్పుడు ఎలా ఉంటామో అలానే చెక్ చేస్తారని ఆమె తెలియజేసింది. ఒంటిమీద నూలు పోగు లేకుండా చెక్ చేసి పంపిస్తారని కస్తూరి వెల్లడించింది.


అయితే చెక్ చేసేవారు లేడీస్ ఉంటారని కస్తూరి చెప్పింది. అయినా నా ప్రైవేట్ పార్ట్స్ లో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేశారని కస్తూరి అన్నారు. అనంతరం తాను సినిమాల్లోకి వచ్చిన సమయంలోనే నన్ను ఓ దర్శకుడు లిఫ్ట్ లోనే నలిపేయాలని చూశాడని కస్తూరి పెద్ద బాంబు పేల్చింది. కానీ ఆ దర్శకుడు ఎవరు అని మాత్రం వెల్లడించలేదు. కస్తూరి చేసిన ఈ కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: