కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి అనే మూవీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి అప్పటివరకు ఏ తెలుగు సినిమా రాబట్టని కలెక్షన్లను రాబట్టే టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే పోకిరి సినిమాకు మొదటగా ఈ టైటిల్ కాకుండా మరో రెండు టైటిల్స్ అనుకున్నారట. కానీ ఆ టైటిల్స్ ను కాకుండా పోకిరి అనే టైటిల్ను ఎందుకు ఫిక్స్ చేశారు అనే వివరాలు తెలుసుకుందాం.

పూరి జగన్నాథ్ "పోకిరి" సినిమాకు సంబంధించిన కథను చాలా సంవత్సరాల క్రితం రెడీ చేసుకున్నాడట. కానీ ఈ సినిమా కథకు మొదటగా ఆయన ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ అనే టైటిల్ ను అనుకున్నారట. ఇదే టైటిల్ తో పోకిరి సినిమా కథను చాలా మంది హీరోలకు కూడా చెప్పాడట. కానీ వారంతా దానిని రిజెక్ట్ చేశారట. ఇక ఇదే టైటిల్ తో మహేష్ బాబు కు పోకిరి సినిమా కథను వినిపించగా ఆయన మాత్రం ఈ కథతో రూపొందే సినిమాలో హీరో గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఈ కథకు ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ అనే టైటిల్ ను కాకుండా కృష్ణమనోహర్ సన్నాఫ్ సూర్యనారాయణ అనే టైటిల్ ను పెట్టాలి అని ఆలోచనకు వచ్చాడట. కానీ ఈ టైటిల్ ను గనుక పెట్టినట్లయితే కృష్ణ మనోహర్ తండ్రి సూర్యనారాయణ అని జనాలకు ఈజీగా తెలిసిపోతుంది అని , క్లైమాక్స్ ట్విస్ట్ కు పెద్దగా జనాలు ఎగ్జిట్ కారు అనే ఉద్దేశంతో ఆ టైటిల్ కాకుండా మరో టైటిల్ ను పెట్టాలి అని ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు అందులో భాగంగా పోకిరి అనే టైటిల్ ను పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: