ప్రతి సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది మాత్రమే మంచి విజయాలను అందుకొని చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతున్నారు. అలా వెళ్లిన వారిలో కూడా కొంత మంది మాత్రమే స్టార్ హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే అద్భుతమైన విజయాలు అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోవడం మాత్రమే కాకుండా అనేక సంవత్సరాలు పాటు అదే ఈమేజ్ ను కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఇప్పటికి కూడా వరుస సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇప్పటికైనా పైన ఫోటోలో ఉన్న చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా ..? పైన ఫోటోలో ఉన్న చిన్న పాప మరెవరు కాదు ఆమె కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ "లక్ష్మి కళ్యాణం" అనే మూవీ తో తెలుగు పరిచయం అయ్యి చందమామ మూవీ తో మొదటి కమర్షియల్ విజయాన్ని అందుకుంది.

మగధీర మూవీ తో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న ఈ బ్యూటీకి ఈ సినిమాతో అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇక ఈ మూవీ తోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయిన ఈమె చాలా సంవత్సరాల పాటు కెరియర్ను అదే జోష్లో ముందుకు సాగించింది. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈమె పెళ్లి చేసుకుంది. ఈమెకు పెళ్లి తర్వాత కొంతకాలానికి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆఖరుగా కాజల్ అగర్వాల్ సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: