తెలుగు సినీ ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. అయితే ఇప్పుడు ఈ ఇంట  అటు సంబరాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాత సురేష్ బాబు ఆయన సోదరుడు హీరో వెంకటేష్ ఇద్దరు కూడా తాతలుగా ప్రమోషన్ పొందారట.. ఎందుకంటే హీరో రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ తండ్రి అయ్యాడట.. అభిరామ్ భార్య ప్రత్యూష  నిన్నటి రోజున పండంటి ఆడ  బిడ్డకు జన్మనిచ్చినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా దగ్గుబాటి ఇంట వేడుకలు చేసుకుంటున్నట్లు సమాచారం.


అభిరామ్ వివాహం గత ఏడాది సైలెంట్ గా దగ్గర బంధువుల అమ్మాయితో జరిగింది. వీరి వివాహం శ్రీలంకలో చాలా గ్రాండ్గా జరిగిన అనంతరం హైదరాబాదులో రిసెప్షన్ కూడా జరిపించారు. తన అన్న రానా పెళ్లి తర్వాతే అభిరామ్ పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ తండ్రిగా మాత్రం రానా కంటే ముందే తమ్ముడే ప్రమోషన్ పొందారు. అభిరామ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో అహింస అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. కానీ సక్సెస్ కాలేకపోవడంతో సినిమాలకు దూరమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అహింస సినిమాతో దారుణంగా ట్రోల్ కి గురయ్యారు.


అయితే సినిమాలలోకి రాకముందే అభిరామ్ ప్రముఖ నటి శ్రీరెడ్డి తో కూడా రిలేషన్ లో ఉన్నట్లుగా గతంలో చాలా రూమర్స్ వినిపించడమే కాకుండా అభిరామ్ గురించి ఎన్నో విషయాలలో శ్రీ రెడ్డి రచ్చ చేసిన సంగతి తెలిసిందే.. అంతేకాకుండా అభిరామ్ తో కలిసి దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా చార్ట్ లను కూడా బయట పెట్టడం జరిగింది. అయితే నెమ్మదిగా ఈ వివాదం ముగిసేసరికి గత ఏడాది వివాహం చేసుకొని అభిరామ్ సెటిల్ అయ్యారు. ఈ విషయం తెలిసిన అందరూ కూడా దగ్గుబాటి హీరోకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అభిమానులు. మరి ఈసారైనా సరైన సినిమాతో కం బ్యాక్ ఇస్తారేమో చూడాలి మరి అభిరామ్.

మరింత సమాచారం తెలుసుకోండి: