సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదం చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది... సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు మరణించారు. వివిధ కారణాలవల్ల... సినిమా ప్రముఖులు మరణిస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలామంది ప్రముఖులను ఇండస్ట్రీ కోల్పోయింది. అయితే తాజాగా చిత్ర పరిశ్రమంలో మరో తీవ్రవిషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో జగపతిబాబు హిట్ సినిమా దర్శకుడు మరణించడం జరిగింది.

 

తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి... తాజాగా ఆ మరణించడం జరిగింది. తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్న తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి.... ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో మరణించినట్లు ధృవీకరించారు. నేషనల్ మీడియాలో కూడా ఈ వార్త వస్తుంది. నిన్న అర్ధరాత్రి నుంచి సభాపతి దక్షిణామూర్తి ఆరోగ్యం విషమించిందని... దీంతో.. ఆసుపత్రికి వెంటనే ఆయన కుటుంబ సభ్యులు తరలించినట్లు చెబుతున్నారు.

 

అయితే ఆసుపత్రికి వెళ్లిన తర్వాత రాత్రంతా ఆయనకు చికిత్స అందించారట వైద్యులు. కానీ తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి బాడీ వైద్యానికి సహకరించలేదట.  దీంతో చేసేది ఏమీ లేక వైద్యులు కూడా చేతులెత్తేసారట. ఈ తరుణంలోనే తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 61 సంవత్సరాలు. ఆయనను అందరూ ముద్దుగా ఎస్డీ సభ  అని పిలుస్తూ ఉంటారు. వాస్తవంగా తమిళ ఇండస్ట్రీలో ఆయన దర్శకత్వం ప్రారంభించారు.


స్టార్ హీరో విజయ్ కాంత్ ను హీరోగా పెట్టి.. భారతను అనే సినిమా చేశారు తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం అందుకోవడంతో వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ప్రభుదేవా తో వీఐపీ అనే సినిమా చేసి సక్సెస్ అయ్యారు. ఇక తెలుగులో 2005లో సినిమా చేశారు సభాపతి. జగపతిబాబు హీరోగా... పందెం సినిమా చేశారు. ఈ సినిమాలో కళ్యాణి హీరోయిన్గా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా బంపర్ హిట్ అయింది. ఇలా దాదాపు పది సినిమాలు ఇండస్ట్రీకి హిట్ ఇచ్చారు సభాపతి దక్షిణామూర్తి.

మరింత సమాచారం తెలుసుకోండి: